Shaheen Afridi:పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ లో భారత్ క్రీడాస్ఫూర్తిని ఉల్లంఘించిందని ఆరోపించాడు. తాజాగా లాహోర్‌లో జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆతను.. భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌ల సమయంలో కనిపించిన పరిణామాలు “క్రీడా విలువలకు విరుద్ధంగా” ఉన్నాయని వ్యాఖ్యానించాడు. Karnataka vs MP: కర్ణాటక బౌలర్లపై ‘వెంకటేష్ అయ్యర్’ దూకుడు.. 160 బంతులు మిగిలుండగానే మధ్యప్రదేశ్ విజయం..! ఇంకా షాహీన్ అఫ్రిది మాట్లాడుతూ.. సరిహద్దు అవతలవైపు ఉన్నవారు…
పాకిస్తాన్ అండర్-19 క్రికెట్ జట్టు ఆసియా కప్‌లో భారత్‌పై ఘన విజయం సాధించిన అనంతరం ఆ దేశ రక్షణ దళాల చీఫ్ ఆసిమ్ మునీర్ ను కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆర్మీ చీఫ్ కి పరిచయం చేశాడు.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 విజేత ట్రోఫీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ట్రోఫీని ఒకటి లేదా రెండు రోజుల్లో ముంబైలోని తన ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇలా రాని పక్షంలో నవంబర్ 4న భారత బోర్డు ఈ సమస్యను ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) వద్ద లేవనెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల…
భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ట్రోఫీ కాంట్రవర్సరీ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప.. సమస్యకు పులిస్టాప్ పడడం లేదు. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఇటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తగ్గేదేలే అంటుండడంతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీనే. నఖ్వీ నాటకాల కారణంగా ఫైనల్ ముగిసి దాదాపు…
ఆసియా కప్ 2025 ట్రోఫీ కాంట్రవర్సరీపై తెలుగు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ స్పందించాడు. సెప్టెంబర్ 28న పాకిస్థాన్‌తో ఫైనల్ అనంతరం తాము గంటసేపు మైదానంలోనే గడిపాము అని, గ్రౌండ్‌లో ట్రోఫీ ఎక్కడా కనిపించలేదని చెప్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతిలో ట్రోఫీ లేదని చెప్పాడు. అందుకే ట్రోఫీ అందుకొన్నట్లుగా తాము క్రియేట్ చేశాం అని తిలక్ తెలిపాడు. ఫైనల్‌లో భారత్ గెలిచినా.. నఖ్వీ ఇప్పటివరకు ట్రోఫీ…
2025 ఆసియా కప్ ట్రోఫీ అప్పగింత అంశంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో చర్చించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ట్రోఫీ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మొండి వైఖరితో ఉండటంతో.. త్వరలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తాలని బోర్డు యోచిస్తున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. Also…
Chiranjeevi : క్రికెటర్ తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి తన సినిమా సెట్ కు పిలిచి సన్మానించారు. రీసెంట్ గా ఆసియా కప్ ట్రోఫీలో పాకిస్థాన్ పై సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాను గెలిపించాడు తిలక్. దాంతో దేశ వ్యాప్తంగా తిలక్ పేరు మార్మోగిపోయింది. ఎందుకంటే పహల్గామ్ అటాక్, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ తో శత్రుత్వం మరింత పెరిగింది. ఇలాంటి టైమ్ లో జరిగిన మ్యాచ్ కాబట్టి అంతా ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని…
Brian Lara: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ, ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ 2025లో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇంకా జట్టులో ఉన్నప్పటికీ, త్వరలోనే అభిషేక్ కూడా ఆ జట్టులో స్థానం సంపాదించే అవకాశముందని…
Mohsin Naqvi: ఆసియా కప్ ఫైనల్ అనంతరం జరిగిన ట్రోఫీ వివాదం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీని చిక్కుల్లో పడేసింది. ట్రోఫీని గెలిచిన భారత జట్టుకు అందజేయకుండా ఆయన తీసుకెళ్లిపోవడం తీవ్ర దుమారం రేపింది. ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో మూడుసార్లు ఓడిపోవడం, ఈ ఘటన పీసీబీ నాయకత్వంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇందులో భాగంగా నక్వీ తాను నిర్వహించే రెండు ముఖ్యమైన పదవులలో ఒకదాన్ని వదులుకోవాలని, లేకపోతే రెండు…
ఆసియా కప్ 2025 ముగిసి మూడు రోజులైనా ‘ఫైనల్’ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ట్రోఫీని ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్న ఏసీసీ ఛైర్మన్, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. నఖ్వీ వైఖరిపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నఖ్వీ వెనక్కి తగ్గాడు. ఏసీసీ భేటీలో బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు. అయితే పీసీబీ చీఫ్…