ఆసియా కప్ 2025లో ఆడుతున్న శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేకు చేదువార్త అందింది. దునిత్ తండ్రి సురంగా వెల్లలాగే గుండెపోటుతో మృతి చెందారు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే శ్రీలంక మేనేజ్‌మెంట్‌కు విషయం తెలిసింది. అయితే మ్యాచ్ పూర్తయిన తరవాత దునిత్‌కు విషయం చెప్పారు. దాంతో అతడు మైదానంలో బోరున విలపించాడు. శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మైదానంలో దునిత్‌కు ఈ విషాదకరమైన వార్తను చెప్పి.. బయటకు తీసుకొస్తున్న వీడియో…
ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్‌లో భాగంగా సెప్టెంబర్ 14 భారత్, పాకిస్థాన్ టీమ్స్ తలపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టాస్, మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్స్ కరచాలనం చేయలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిబంధనలు ఉల్లంఘించాడని, టోర్నీ నుంచి అతడిని తొలగించాలని ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తొలగించకుంటే తాము టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ ఏసీసీని హెచ్చరించింది. ఈ విషయంపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది. మ్యాచ్ రిఫరీని…
Asia Cup 2025: ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్‌లో సూపర్-4 దశకు చేరిన నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే గ్రూప్-A నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు స్థానం సంపాదించగా.. తాజాగా గ్రూప్-B నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు కూడా అర్హత సాధించాయి. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. గ్రూప్-B చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా సూపర్-4లోకి ప్రవేశించింది. ఒకవేళ…
ఆసియా కప్ 2025లో తన చివరి గ్రూప్ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. పసికూన ఒమన్‌ను సూర్య సేన ఢీకొట్టనుంది. ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్ 4 పోరు నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్‌ను ప్రాక్టీస్‌లా ఉపయోగించుకోనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత్.. యూఏఈ, పాకిస్థాన్‌లపై ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట భారత్ పసికూన ఒమన్‌పై గెలవడం ఖాయం. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్…
ఆసియా కప్ 2025లో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్, యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముంగిట నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండో-పాక్ కరచాలన వివాదానికి బాధ్యుడిగా పేర్కొంటూ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తప్పించాలన్న తమ డిమాండ్‌కు ఐసీసీ అంగీకరించకపోవడంతో.. యూఏఈ మ్యాచ్‌ను బహిష్కరించడానికి పాక్ సిద్ధమైంది. హై డ్రామా తర్వాత రిఫరీ ఆండీ తమ జట్టుకు క్షమాపణ చెప్పినట్లు పీసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది. వెంటనే…
ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పడంతోనే తాము ఆసియా కప్ 2025 నుంచి వైదొలగలేదు అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వి వెల్లడించారు. పీఎం సహా చాలా మంది మద్దతు తమకు ఉందని, ఆసియా కప్‌ను బహిష్కరించాలనుకుంటే పెద్ద నిర్ణయమే అవుతుందన్నారు. తాము సమస్యను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాం అని చెప్పారు. క్రీడలు, రాజకీయాలు ఎప్పటికీ ఒకటి కాదని తాము నమ్ముతున్నాం నఖ్వి తెలిపారు. నిజానికి టోర్నీ నుంచి వైదొలిగితే ఆర్థికంగా…
ఆసియా కప్ 2025లో గ్రూప్-ఎ నుంచి సూపర్-4 చేరాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో పాక్ గెలిచింది. ఈ విజయంతో పాకిస్థాన్ సూపర్-4కు చేరుకుంది. గ్రూప్-ఎ నుంచి భారత్ ఇప్పటికే సూపర్-4కు చేరుకుంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన యూఏఈ పరాజయం పాలైంది. లేదంటే ఆతిథ్య యూఏఈ సంచలనం సృష్టించేదే. గ్రూప్-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్థాన్, యూఏఈల మధ్య…
Pakistan: ఆసియా కప్ 2025లో అనుకొని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ‘హ్యాండ్ షేక్’ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు హైడ్రామా చేస్తోంది. నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరగాల్సిన మ్యాచ్ సమయానికి పాకిస్తాన్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రావాల్సి ఉండగా ఆటగాళ్లు అందరూ హోటల్ రూమ్ కే పరిమితమైంది. భారత్ తో జరిగిన మ్యాచ్ లో.. మ్యాచ్ ముగిసిన తర్వాత హ్యాండ్ షేక్ ఇవ్వని కారణంగా పాకిస్థాన్ జట్టు ఈ విధంగా…
Asia Cup 2025: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌ను ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను “హ్యాండ్‌షేక్ వివాదం” కారణంగా ఆడకుండా బహిష్కరించినట్లు సమాచారం. అందిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకునట్లు సమాచారం. మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై సరిగా వ్యవహరించలేదని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)…
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే హోరాహోరీగా పోరు ఉంటుంది. ప్రతిక్షణం ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, బంతి బంతికి మలుపులు, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. ఇండో-పాక్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తూ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ చూసిన వారికి కాస్త నిరాశే ఎదురైంది. మ్యాచ్ చప్పగా సాగడంతో…