ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ముందుగా బ్యాటింగ్‌లో 127 పరుగులే చేసిన పాక్.. ఆపై బౌలింగ్‌లో కూడా దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఘోర వైఫల్యం ఆ జట్టుపై ప్రభావం చూపింది. ప్రపంచంలో బెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన అఫ్రిది.. 16 ఓవర్లలో రెండు ఓవర్లే బౌలింగ్ చేయడం విశేషం. ఆ రెండు ఓవర్లలో ఏకంగా 23 రన్స్ ఇచ్చుకున్నాడు. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అతడి బౌలింగ్‌లో రెచ్చిపోయాడు. అఫ్రిది బౌలింగ్‌లో అభిషేక్ రెండిసి బౌండరీలు, సిక్సులు బాదాడు.
Also Read: IND vs PAK: పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు పాక్ కెప్టెన్ డుమ్మా.. డ్రెస్సింగ్ రూమ్‌లో దాక్కొని!
స్వల్ప లక్ష ఛేదనలో పాకిస్థాన్ తన మెయిన్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదిపై నమ్మకం పెట్టుకుంది. ఆ ఆశలను అతడు మొదటి బంతికే వమ్ముచేశాడు. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ మొదటి బంతిని బౌండరీ, రెండో బంతిని సిక్స్ బాదాడు. దాంతో మొదటి ఓవర్లోనే 12 రన్స్ వచ్చాయి. అఫ్రిది తన రెండో ఓవర్లో 11 రన్స్ ఇచ్చాడు. ఈ ఓవర్లో కూడా అభిషేక్ ఓ బౌండరీ, సిక్స్ కొట్టాడు. రెండు ఓవర్లలో ఒక్క వికెట్ తీయకుండా భారీగా పరుగులు ఇచ్చాడు. దాంతో అతడిపై పాక్ ఫాన్స్ మండిపడుతున్నారు. అతడిపై మీమ్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మాకు షాహిన్ అఫ్రిది దొరికాడో.. ఉరికించి ఉరికించి కొడతాం’ అంటూ నెటిజెన్స్ చేస్తున్నారు.
When Abhishek Sharma Meets Shaheen Afridi 👋#INDvsPAK #AsiaCupT20 #AsiaCup20225 pic.twitter.com/W2BcurzY8v
— Siju Moothedath (@SijuMoothedath) September 14, 2025
Abhishek Sharma to Shaheen Afridi pic.twitter.com/9hOryFKtfY
— చంద్రశేఖర్🦅 (@OrangeMB_CK) September 14, 2025
Abhishek Sharma 1st Ball Four
2nd Ball Six 🔥🔥🔥 Against Shaheen Afridi#INDvsPAK #AsiaCup2025 pic.twitter.com/NiJVYEsWLF— MR siyag🔰 (@MR_jaats) September 14, 2025