IND vs PAK: పనికిమాలిన ప్లేయర్స్, డబ్బులు బొక్క.. ఇకపై మ్యాచ్ మేం చూడం!
- భారత్ మ్యాచ్‌లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన
- పాకిస్థాన్ అభిమానుల మనస్సులు ముక్కలు
- ఇకపై మ్యాచ్ మేం చూడం అంటున్న ఫాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే.. హోరాహోరీ పోరు, ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. దుబాయ్ స్టేడియంలో పాక్ అభిమానుల సందడి కాసేపు కనిపించినా.. ఆ తర్వాత అది కూడా కనిపించకుండా పోయింది. పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కారణంగా ఫాన్స్ నిరాశలో కనిపించారు. భారత్ చేతిలో ఓటమి అనంతరం మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానుల మనస్సులు ముక్కలయ్యాయి.
దుబాయ్‌లో మ్యాచ్ చూడటానికి వచ్చిన పిల్లల నుంచి పెద్దవారి వరకు పాకిస్థాన్ అభిమానులు తమ జట్టుపై తీవ్ర విమర్శలు చేశారు. స్టేడియం వెలుపల పాక్ అభిమానులు ఏఎన్‌ఐతో మాట్లాడారు. ఒక అభిమాని మాట్లాడుతూ… ‘పనికిమాలిన ప్లేయర్స్ జట్టులో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పస కనిపించలేదు. మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందని అనుకున్నాము కానీ.. అదీ లేదు’ అని అన్నాడు. ‘నేను చాలా డబ్బు ఖర్చు చేసి అబుదాబి నుండి వచ్చాను. తీరా చూస్తే ఎంజాయ్ మెంట్ లేదు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఏకపక్షంగా సాగింది. మ్యాచ్ నిలిచిపోయి ఉంటే బాగుండేది అనుకున్నా. భారత్ బాగా ఆడింది’ అని మరొక ఫాన్స్ చెప్పాడు.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. దిగొచ్చిన బంగారం ధరలు!
‘సెప్టెంబర్ 21న సూపర్ ఫోర్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండొచ్చు. ఆ మ్యాచ్‌కు నేను రాను. వస్తే డబ్బులు బొక్క’ అని మరో పాకిస్థాన్ అభిమాని నిరాశగా చెప్పాడు. ‘మా ప్లేయర్స్ చాలా చెత్త ఆట ఆడారు. మ్యాచ్ మధ్యలోనే డిన్నర్ ఎక్కడ చేద్దామని ఆలోచించాను. ఇకపై మ్యాచ్ మేం చూడం’ అని ఓ పిల్లడు చెప్పుకొచ్చాడు. ‘పాకిస్థాన్ చెత్తగా ఆడింది’ అంటూ మరో అభిమాని నిరుత్సాహంగా చెప్పాడు. అయితే కొందరు ఫాన్స్ మాత్రం జట్టుకు అండగా నిలబడ్డారు. ‘ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారు. భారత జట్టు పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉంది’ అని ఓ ఫ్యాన్ మద్దుతు ఇచ్చాడు.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!