ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముంగిట ఓ బిగ్ మిస్టేక్ చోటుచేసుకుంది. క్రికెట్ ఆటలో మ్యాచ్ ఆరంభానికి ముందు రెండు జట్ల ఆటగాళ్లు.. తమ తమ జాతీయ గీతాలు ఆలపించడం ఆనవాయితీ. ఇండో-పాక్ మ్యాచ్‌లో ముందుగా పాకిస్థాన్ జాతీయ గీతం మొదలు కావాల్సి ఉంది. అయితే డీజే ఆపరేటర్ పొరపాటుగా పంజాబీ-ఇంగ్లిష్ పాప్ సాంగ్ ‘జలేబీ బేబీ’ని ప్లే చేశాడు. దాంతో పాక్ ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పొరపాటు గుర్తించిన ఆపరేటర్ వెంటనే పాక్ జాతీయ గీతాన్ని ప్లే చేశాడు.
Also Read: Shaheen Afridi: షాహిన్ అఫ్రిది దొరికాడో.. ఉరికించి ఉరికించి కొడతాం!
పాకిస్థాన్ జాతీయ గీతం ప్లేయర్స్ అందరూ ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాకిస్థాన్ జాతీయ గీతం అనంతరం భారత్ జాతీయ గీతం ప్లే అయింది. ఇక టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ అఘాతో కరచాలనం చేయలేదు. మ్యాచ్ అనంతరం కూడా పాక్ ఆటగాళ్లను భారత్ ప్లేయర్స్ కలవకుండా వెళ్లిపోయారు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ 127 రన్స్ చేయగా.. భారత్ సునాయాసంగా చేధించింది.
DJ played Jalebi Baby song on Pakistan National anthem 🤣#INDvsPAK #BoycottINDvPAK pic.twitter.com/rJBmfvqedI
— 𝗩 𝗔 𝗥 𝗗 𝗛 𝗔 𝗡 (@ImHvardhan21) September 14, 2025