ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ పేస్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 11.50 ఎకానమీతో 23 రన్స్ ఇచ్చాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ దెబ్బకు షాహిన్ భారీగా రన్స్ ఇచ్చి.. వికెట్లేమీ తీయలేదు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం 16 బంతుల్లోనే 33 పరుగులు చేసి.. పాక్ టీమ్ స్కోర్ 100 పరుగులు దాటేలా చేశాడు.
Also Read: Asia Cup 2025: పట్టించుకోని ఐసీసీ.. తోకముడిచిన పాకిస్థాన్ బోర్డు!
బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన చేసిన తన అల్లుడు షాహిన్ అఫ్రిదిని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై ఫైర్ అయ్యాడు. వికెట్స్ తీయమని, నీ పరుగులు ఏం వద్దు అని విమర్శించాడు. ‘భారత్ మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది బ్యాట్‌తో రాణించాడు. అతడి బ్యాటింగ్ కారణంగానే పాక్ 100 పరుగుల మార్క్‌ను దాటింది. నేను షాహిన్ పరుగులు చేయడాన్ని ఇష్టపడను. అతడు బౌలర్. బౌలింగ్‌లో వికెట్స్ తీయాలి. సైమ్ అయుబ్ బౌలింగ్ చేయడాన్ని కోరుకోను. అతడు బ్యాటర్ కాబట్టి పరుగులు చేయాలి. షాహిన్ జట్టులో తన పాత్ర ఏంటో ముందు తెలుసుకోవాలి. కొత్త బంతిని స్వింగ్ చేసి వికెట్లు ఎలా తీయాలో నేర్చుకోవాలి. బౌలింగ్ మీద దృష్టిపెట్టాలి’ అని షాహిద్ అఫ్రిది సూచించాడు.