Jasprit Bumrah Will Play Asia Cup 2025: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ‘ది ఓవల్’ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం లేదు. పని భార నిర్వహణలో భాగంగా చివరి టెస్ట్ ఆడడం లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముందే మూడు టెస్టులు మాత్రమే ఆడుతానని బీసీసీఐకి బుమ్రా తెలిపిన విషయం తెలిసిందే. ఓవల్ టెస్ట్ ఆడని బుమ్రాను…
Danish Kaneria: పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్లతో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మ్యాచ్ నుండి వైదొలిగినందుకు మాజీ పాకిస్తాన్ బౌలర్ డానిష్ కనేరియా భారత క్రికెటర్లను విమర్శించారు. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ మాజీ స్పిన్నర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మీకు అనుకూలమైనప్పుడు దేశభక్తిని ఉపయోగించడం మానేయండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఖరారైన తర్వాత భారత క్రికెటర్లపై విమర్శలు గుప్పించారు.
ఆసియా కప్ కోసం క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025 ఆసియా కప్ షెడ్యూల్ వెల్లడైంది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యుఎఇలో జరుగనుంది. భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది. ఈ రెండు జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ టోర్నమెంట్ టి20 ఫార్మాట్‌లో జరుగనుంది. ఇది ఐసిసి టి20 ప్రపంచ కప్ 2026 సన్నాహాల్లో భాగంగా నిర్ణయించారు. ఆ ప్రపంచ…
Asia Cup 2025: ఆసియా కప్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. మరోసారి క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచబోతోంది. దాయాదులు మరోసారి కలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ ఉండే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఈ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ T20 టోర్నమెంట్‌కు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలుస్తోంది.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 నిర్వహణ పైనా అనిశ్చితి నెలకొంది. ఈ నెల (జూలై) చివరి వారంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ మీటింగ్ కు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా మారింది. అయితే, ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా అయింది. ఇక్కడ జరగబోయే ఏసీసీ మీటింగ్‌కు తాము హాజరుకావడం లేదని ఇప్పటికే భారత్, శ్రీలంక దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు సమాచారం ఇచ్చాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి
క్రికెట్లో టీమిండియా ఎక్కడ ఆడినా ఆదరణ లభిస్తుంది. మరి ముఖ్యంగా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి కారణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అవును ఆసియాకప్ లో ఇరుజట్లు 2 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరింత రసవత్తరంగా సాగుతుంది.పైగా ఆసియాలోనే ఇవి రెండు బలమైన జట్లు. అందుకే రెండు లేదా 3 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది. నిజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే…
India to host 2025 Asia Cup in T20 Format: 2025లో జరగనున్న పురుషుల ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. 1984లో ఆసియా కప్ మొదలవ్వగా.. చివరిగా భారత్ 1991లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత భారత్ గడ్డపై టోర్నీ జరగలేదు. 34 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో…