రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే, నాయకుల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి మైనస్ గా మారింది. ముఖ్యంగా సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య చెలరేగిన వివాదం తారా స్థాయికి చేరింది. 2018 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిపై వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి.
ఎన్నికల వేళ ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య పోరు జరగడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సీఎం గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో చేసిన పనుల ఆధారంగా తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. సచిన్ పైలట్‌తో గొడవలపై స్పందించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. మీడియా ప్రజలను పోరాడేలా చేయకూడదని అన్నారు. ఆయన ఎవరి పేరు ప్రస్తావించకుండా మాట్లాడుతూ.. మీడియా ప్రజలను పోరాటాలు చేయవద్దని అన్నారు. మీడియా నిజం, వాస్తవాలకు కట్టుబడి ఉండాలన్నారు. మీడియా మనల్ని ఒకరితో ఒకరు కొట్టుకునేలా చేయకూడదని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు.
Also Read:India’s First Water Metro: దేశంలో తొలి వాటర్ మెట్రో…నేడే ప్రారంభం
తన ప్రభుత్వ పథకాలు మరియు రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తామన్నారు. గత ఐదేళ్లలో చేసిన పనుల ఆధారంగా తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంధి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి పెద్ద రోడ్ షోలలో పాల్గొంటారని, డబ్బు ఖర్చు చేస్తారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రతిదీ చేస్తారన్నారు. అయితే తాము ప్రభుత్వ పనులను ప్రజలకు వివరిస్తు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
Also Read:Woman Protest: పచ్చబొట్టు చెరిగిపోదులే.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలెట్ తీరుతో హైకమాండ్ ఆందోళనతో ఉంది. సొంత ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలో ఓవర్గం ఆగ్రహంతో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూనే ఇటీవలే పైలట్ సీఎం గెహ్లాట్‌కు వ్యతిరేకంగా రోజంతా నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, గెహ్లాట్ మాత్రం పైలట్ అంశంపై పెద్దగా స్పందించలేదు.