Ashok Gehlot: నేను రావణుడినైతే.. కేంద్ర మంత్రిపై మండిపడిన గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gehlot: తనను “రావణ్” అని పిలిచినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఎదురుదాడికి దిగారు. సంజీవని క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో షెకావత్ ప్రమేయాన్ని గెహ్లాట్ ప్రస్తావిస్తూ, “నేను రావణుడినైతే, నువ్వు రాముడివి అయ్యి, పెట్టుబడిదారుల సొమ్మును తిరిగి ఇవ్వు” అని అన్నారు. “మీరు నాపై రాళ్లు వేస్తే, పేదలకు ఇళ్లు నిర్మించడానికి నేను వాటిని ఉపయోగిస్తాను” అని బీజేపీ నాయకుడికి సవాల్ విసిరారు. హనుమాన్‌గఢ్‌లోని రావత్‌సర్ పట్టణంలోని ద్రవ్యోల్బణ సహాయ శిబిరాన్ని సందర్శించిన అనంతరం జరిగిన సభలో గెహ్లాట్ మాట్లాడుతూ.. ఈ కుంభకోణంలో షెకావత్ స్నేహితులు జైలులో ఉన్నారని, కేంద్ర మంత్రి కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. షెకావత్ దోషి అయితే నైతిక కారణాలతో రాజీనామా చేయాలని, లేదంటే ప్రధాని నరేంద్ర మోదీ బర్తరఫ్ చేయాలని ఆయన అన్నారు.
Read Also: Poonch Terror Attack: పూంచ్ దాడిలో సంచలన విషయం.. ఉగ్రవాదులకు స్థానికుల సాయం..
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
గురువారం చిత్తోర్‌గఢ్‌లో జరిగిన బీజేపీ జన్ ఆక్రోశ్ ర్యాలీలో షెకావత్ మాట్లాడుతూ.. “రాజస్థాన్‌లో ఈ రాజకీయ రావణుడైన అశోక్ గెహ్లాట్ పాలనను మీరు అంతం చేయాలనుకుంటే, చేతులు పైకెత్తి రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించండి” అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గెహ్లాట్ శుక్రవారం స్పందిస్తూ, “ఈ రోజుల్లో, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఇతర బీజేపీ నాయకులు నన్ను దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. నేను రావణుడినా? మీరు (షెకావత్) సంజీవని సొసైటీలో 2.5 లక్షల మందిని దోచుకున్నారు. మీ స్నేహితులు జైల్లో ఉన్నారు. మీరు ఎప్పుడైనా జైలుకు కూడా వెళ్లవచ్చు. ఈ కుంభకోణానికి సంబంధించి షెకావత్ అరెస్టుపై రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్ బెంచ్ ఇటీవల స్టే విధించింది.” అని చెప్పుకొచ్చారు. ఈ కుంభకోణంతో తనకు సంబంధం ఉందంటూ చేసిన వ్యాఖ్యలకు గాను కేంద్ర మంత్రి గెహ్లాట్‌పై ఢిల్లీ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు.షెకావత్ అరెస్ట్‌పై హైకోర్టు స్టే విధించడాన్ని గెహ్లాట్, ప్రస్తావిస్తూ.. “అతను(షెకావత్) హైకోర్టు నుంచి స్టే తీసుకున్నాడు. నేనేమీ నిందితుడిని కాను అని ఆయన చెప్పేవారు. మీరు నిందితులు కాకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారు? నీకు బెయిల్ ఎందుకు వచ్చింది?” అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..