ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుందని, వక్ఫ్‌ను ఖతం చేయాలని అనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా బీజేపీ చేయాలనుకుంటుందని అసదుద్దీన్ మండిపడ్డారు. ఈరోజు దారుస్సలాంలో ఎంపీ…
Waqf Bill: వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు కత్తెర వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లను కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించి సభలో ఆందోళన చేశాయి.
Asaduddin Owaisi: వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో చాలా ప్రమాదకరమైన సెక్షన్లు ఉన్నాయని గురువారం విరుచుకుపడ్డారు. ఇది చట్టం కాదని, వక్ఫ్‌ని నేలమట్టం చేసి, ముస్లింలను అంతం చేయడమే లక్ష్యమని ఆరోపించారు.
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురువారం నాడు వ్యతిరేకించారు. “వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే ఈ సవరణలు చేయడానికి ఈ సభకు అర్హత లేదు. ఈ బిల్లు ఆర్టికల్స్ 14, 15, మరియు 25 కింద ఉన్న సూత్రాలను ఉల్లంఘిస్తోంది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రత మరియు అధికార విభజన సూత్రాలను ఉల్లంఘించినందున ఇది వివక్షత,…
Waqf board: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు మార్పులు తేవడానికి కొత్తగా బిల్లు తీసుకురావాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మసీదులు, ఇస్లాంలో సంబంధం ఉన్న ఆస్తుల్ని నిర్వహించే వక్ఫ్ బోర్డుల ‘‘అపరిమిత అధికారాలను’’ అరికట్టడానికి కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అనుకుంటోంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హీట్ హీట్ గా కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా.. ఏఐఎంఐఎం (AIMIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం, జార్ఖండ్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం సహజమే.. కానీ తరచూ జరిగే రైలు ప్రమాదాలను సాధారణ సంఘటనగా పేర్కొనలేమని ఆయన అన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ తప్పిదం ఉందని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో…