Asaduddin Owaisi: కాశీ బోర్డులో అందరూ హిందువులే.. వక్ఫ్‌లో ముస్లిమేతరులు ఎందుకు?
- వక్ఫ్ సవరణ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పలు ప్రశ్నలు
- కాశీ బోర్డులో అందరూ హిందువులే ఉన్నారు
- వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఎందుకని ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ సవరణ బిల్లుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టంపై బీజేపీ ప్రభుత్వం తప్పుడు అజెండాలు సృష్టించి.. ప్రచారం చేస్తుందన్నారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో 9 లక్షల 40 ఎకరాల భూమి ఉందని.. కానీ ఇప్పటికీ ఈ భూమిని లాక్కున్నట్లు పుకార్లు వ్యాపిస్తూనే ఉన్నాయన్నారు. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు కాదు.. వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చిందన్నారు.
READ MORE: Delhi: మరో ఉద్యోగిని బలి తీసుకున్న పని ఒత్తిడి.. హెచ్‌డీఎఫ్‌సీ ఎంప్లాయి అనుమానాస్పద మృతి!
Also Read
- SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
హిందూ మతంలో ఎవరైనా ఎప్పుడైనా విరాళం ఇవ్వవచ్చు.. కానీ ముస్లిం సమాజంలో ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీలో 8 నుంచి 9 మంది ముస్లిమేతరులను ఎందుకు నియమించాలనుకుంటున్నారు? అని అడిగారు. యూపీలోని కాశీ బోర్డులో సభ్యుడు తప్పనిసరిగా హిందువు అయి ఉండాలి అని స్పష్టంగా రాసి ఉందని.. కాబట్టి వక్ఫ్ బోర్డులోకి హిందువులను ఎందుకు తీసుకురావాలని ఒవైసీ ప్రశ్నించారు. తిరుపతి దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉండటం వల్ల సమస్య ఏర్పడింది కానీ.. ముస్లిం మతంలో భాగమైన వక్ఫ్ బోర్డుపై ఎందుకు అలా స్పందించడం లేదు అని ప్రశ్నించారు.
READ MORE:Tirumala Laddu: ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. నెయ్యి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు
ఇదిలా ఉండగా.. మరోపైపు వక్ఫ్ బిల్లుపై వచ్చిన కోటి మందికి పైగా ఫీడ్‌బ్యాక్‌పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆగస్టు 8న వక్ఫ్ బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ వంటి ప్రతిపక్షాలు ఈ బిల్లును ముస్లిం వ్యతిరేక బిల్లుగా అభివర్ణించాయి. విపక్షాల మధ్య ఈ బిల్లు లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండానే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపబడింది. బిల్లును మెరుగుపరచడానికి జేఏసి అభిప్రాయాన్ని కోరింది. ఇప్పటి వరకు 1.25 కోట్ల సూచనలు వచ్చాయి. అయితే, నిషికాంత్ దూబే ఫీడ్‌బ్యాక్ సంఖ్యపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ లెక్కలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని దూబే అన్నారు.
తాజావార్తలు
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!