Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ సర్కార్, దాని నిఘా సంస్థ ISI యొక్క అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని ఆరోపించారు.
Asaduddin Owaisi : పాకిస్తాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. అయితే, ఆ నీటిని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిల్వ చేస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం, ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. “బైసరన్ మైదానంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లను ఎందుకు మోహరించలేదు? దాడి జరిగిన తర్వాత అక్కడికి చేరుకోవడానికి ఎందుకు ఆలస్యమైంది?” అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు మతం…
Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామనే సందేశాన్ని పంపడానికి శుక్రవారం ప్రార్థనలకు వెళ్లేటప్పుడు ముస్లింలు తమ్ చేతులకు నల్ల బ్యాండ్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి నిఘా వైఫల్యమే కారణమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దాడిని ఊచకోతగా ఆయన అభివర్ణించారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది ఉరి ప్రాంతం, పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని, బాధాకరమైందన్నారు. ఈ సంఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాని డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వక్ఫ్ చట్టంపై వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్ కి బీజేపీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుంది అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి చెప్పాలి.. వక్ఫ్ ఆదాయం అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెంచాలకు ఉపయోగపడుతుంది, తప్ప సామాన్యులకు ఉపయోగ పడడం లేదు.. వక్ఫ్ ఆదాయం బినామీల ద్వారా దారుస్సలంకి…
Asaduddin Owaisi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు-2025 పార్లమెంట్‌లో పాస్ అయింది. కాంగ్రెస్, ఎస్పీ వంటి ఇండీ కూటమి పార్టీలు లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. అయినప్పటికీ బీజేపీ కూటమికి సంఖ్యా బలం ఉండటంతో బిల్లు రెండు సభల్లో సులభంగా నెగ్గింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మొహహ్మద్ జావెద్ బిల్లును వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. Read…
వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక ఇదే బిల్లుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. కేవలం ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి ఈ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు.
Asaduddin Owaisi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ బుధవారం పార్లమెంట్ ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం బిల్లును ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే, ఎంపీలు అంతా సభకు హాజరుకావాలని ఎన్డీయే పార్టీలు తమ తమ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మరోవైపు, ఈ బిల్లును అడ్డుకునే దిశగా కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ వంటి ఇండీ కూటమి నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. రేపు, ఉదయం ఇండీ కూటమి ఎంపీలతో…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్వాగతిస్తున్నాము. కేంద్రం పారదర్శకంగా లేదు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. RRR మంజూరు...మెట్రో మంజూరు కోసం ..బాపు ఘాట్ అభివృద్ధికి ... మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని అడిగారు.