‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. రెండు దశల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఈ కమిటీ సూచించింది. ఈ కమిటీ నివేదికను కేబినెట్ బుధవారం ఆమోదించింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అంశంపై పలువురు విపక్ష నేతలు ఇది ఆచరణాత్మకం కాదని అన్నారు. కొందరు నేతలు దీనిపై సానుకూలంగా స్పందించారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్‌తోపాటు పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దేశ ప్రజలు దీన్ని అంగీకరించబోరని అన్నారు. ఎన్నికల సమస్యలు సృష్టించి ప్రజలను మళ్లిస్తున్నారని ఆరోపించారు. ‘ఒక దేశం-ఒకే ఎన్నికలు’ ఆచరణాత్మకం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
READ MORE: Udhayanidhi Stalin: డిప్యూటీ సీఎం పదవిపై ఉదయనిధి ఏమన్నారంటే..!
దీనిపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఎంపీ ఇలా రాసుకొచ్చారు. “దేశంలోని ఫెడరలిజాన్ని నాశనం చేయడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని రాజీ పడేలా చేయడం వల్లే తాను ఒకే దేశం-ఒకే ఎన్నికలను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. బహుళ ఎన్నికలు మోడీ, షాలకు తప్ప ఎవరికీ ఇబ్బంది కాదు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నందున ఇలా చేస్తున్నారు. సక్రమంగా, ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్య జవాబుదారీతనం కూడా మెరుగుపడుతుంది.” అని రాసుకొచ్చారు.