హైదరాబాద్ లోక్ సభ ఎంపీ, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ హౌస్‌లో పాలస్తీనాకు మద్దతుగా నినాదాలు చేయడం వివాదానికి దారితీసింది. ఒవైసీపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాది హరిశంకర్ జైన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒవైసీకి వ్యతిరేకంగా లేఖ రాశారు.
Asaduddin Owaisi: లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ చేసిన నినాదాలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ ఆయన నినాదాలు చేశారు.
Asaduddin Owaisi: 18వ లోక్‌సభకు ఇటీవల ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతోంది. ఎంపీ ఎన్నికల్లో గెలిచిన సభ్యులచే స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన ప్రమాణస్వీకారం లోక్‌సభలో దుమారం రేపింది. ఉర్దూలో ప్రమాణస్వీకారం చేసిన ఓవైసీ, ‘‘జై పాలస్తీనా’’ అని నినదించడం చర్చనీయాంశంగా మారింది. Read Also: Darshan Case: యాక్టర్ దర్శన్ కేసులో కీలక పరిణామం.. సీఎం సిద్ధరామయ్యని కలిసిన రేణుకాస్వామి పేరెంట్స్.. అసదుద్దీన్…
ఎంఐఎం పార్టీ నేతపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ పెట్రోల్ పంపు సమీపంలో మాలెగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై కాల్పులకు పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీకి మాలిక్ ప్రముఖ నాయకుడిగా ఉన్నారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత ముస్లిం మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడంతో ఆమెపై కేసు నమోదు చేయాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి ఎంపీ, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ మరోసారి ఒవైసీ సోదరులకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి వీధిలో రామభక్తులు, మోడీ సింహాలు ఉన్నాయని హెచ్చరించారు.