Bandi Sanjay : పాతబస్తీ వాసులారా…. ఇకనైనా మేల్కొండి
- వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు చెందాలన్నదే కేంద్రం ఉద్దేశం
- ఓల్డ్ సీటీ ఇన్నాళ్లుగా ఎందుకు న్యూసిటీ ఎందుకు కాలేదో అర్ధమైందా?
- మీ ఓట్లతో ఒవైసీ కుటుంబం లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా కూడబెట్టారో తెలుసుకోండి : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలని చెబుతున్న నరేంద్ర మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డ్ లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ అసలు రంగు ఈరోజు పూర్తిగా బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి, వక్ఫ్ బోర్డు భూములకు లింకు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ‘‘కలియుగ ప్రత్యక్ష దైవం…. ఆ వైకుంఠాధీశుడు కొలువైన పరమ పవిత్రమైన స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం. వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూములకు సంబంధించిన వ్యవహారం మాత్రమే. మీరు ప్రార్ధించే మక్కా మసీదు కూడా కాదు. అయినా సిగ్గులేకుండా టీటీడీకి, వక్ఫ్ బోర్డు పేరుతో సాగిస్తున్న భూముల దందాకు లింకు పెడతవా? ఒవైసీ’’ అంటూ మండిపడ్డారు. టీటీడీలో ముస్లిమేతరులకు స్థానం కల్పించనప్పుడు….వక్ఫ్ బోర్డులో హిందువులకు ఎందుకు స్థానం కల్పించాలంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలనూ బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు మాత్రమే దక్కాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని, అందులో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చిందని తెలిపారు. టీటీడీ తనకు వచ్చిన విరాళాలతో పేదలకు, హిందూ ధార్మిక సంస్థలకు సాయం చేస్తోందే తప్ప…ఏనాడూ ప్రజల ఆస్తులను కబ్జా చేసుకోలేదని చెప్పారు.
Minister Nadendla Manohar: ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకం
Also Read
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
‘‘ఒవైసీ ద్రుష్టిలో భగవంతుడంటే వ్యాపారమే. అల్లా పేరు చెప్పుకుని భూములను దోచుకున్నడు. వేల ఎకరాలను కబ్జా చేసిండు. కాలేజీలు, ఆసుపత్రులు కట్టి వేల కోట్ల రూపాయలు దోచుకుంటుండు. చివరికి చెరువులను, శిఖం భూములను కూడా కబ్జా చేసి భవంతులు కట్టుకున్నడు. అట్లాంటి మతోన్మాది దేవుడిని వ్యాపార వస్తువుగా, అవకాశవాద అంశంగా మార్చుకోకుండా మాట్లాడగలడా…?’’అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పాతబస్తీ వాసులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘ఒవైసీ మాటలు నమ్మి దశాబ్దాలుగా మోసపోతున్న పాతబస్తీ ముస్లిం సోదరులకు నేను చెప్పేదొక్కంటే… ‘‘ఇకనైనా వాస్తవాలు ఆలోచించాలి. దశాబ్దాల తరబడి ఓట్లేసి మీరు ఎంఐఎంను గెలిపిస్తున్నరు. అయినా ఓల్డ్ సిటీ ఇంకా ఎందుకు ఓల్డ్ సిటీగానే మిగిలిపోయింది? సైబరాబాద్ లాగా న్యూసిటీ ఎందుకు కాలేకపోయింది? కనీసం పాతబస్తీకి మెట్రో ఎందుకు రాలేకపోయింది? మీరింకా పాన్ షాపులు నడుపుకుంటూ, పంక్చర్లు వేసుకుంటూ, తినడానికి తిండిలేక సరైన ఇల్లు లేక ఎందుకు అల్లాడుతున్నరు?. మీ పిల్లలకు మంచి చదువులు ఎందుకు చదివించలేకపోతున్నరు? మంచి వైద్యం ఎందుకు అందించలేకపోతున్నరు? అదే సమయంలో మీ ఓట్లతో గెలిచిన ఒవైసీ కుటుంబం వక్ఫ్ భూములను ఆక్రమించి, చెరువు శిఖం భూములను కబ్జా చేసి కాలేజీలు, ఆసుపత్రులు కట్టి సేవ పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఎట్లా దోచుకుంటున్నరు..? అద్దాల భవంతుల్లో ఎట్లా తుల తూగుతున్నరు?…ఒక్కసారి ఆలోచించండి’’ అని కోరారు.
‘‘బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గర ఉన్నాయి. అవి చెబితే వాళ్లు తట్టుకోలేరు. ఆ విషయాలన్నీ నేను ఇప్పుడు బయటపెట్టాలా ?’’ అంటూ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన కుటుంబ పార్టీ(బీఆర్ఎస్)తో పదేళ్లు అంటకాగిన నిఖార్సన దేశద్రోహ(ఎంఐఎం) పార్టీ. ఇయాళ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. తన అవసరార్ధ మిత్రుడి(బీఆర్ఎస్)ని మించి దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రాజ్యమేలుతున్న నకిలీ గాంధీ వారసుల పార్టీ(కాంగ్రెస్)ని మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతోంది. పాపం…. ఒవైసీ సోదరుల శీల పరీక్ష గడువు ముగిసినట్లుంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజాస్వామిక తెలంగాణ నినాదంతో ప్రజల్ని నమ్మించి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలను బిచ్చగాళ్లను చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని వాడుకుని వదిలేసింది. నకిలీ గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాలతో దేశాన్ని దోచుకునేందుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీతో అంటకాగేందుకు సిద్దమైంది. కల్వకుంట్ల కుటుంబమా? ఇకనైనా సిగ్గుతో తలదించుకోండి. రాజకీయ మతోన్మాదంతో రగిలిపోతూ జన్మనిచ్చిన తల్లికే వెన్నుపోటు పోడుస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న (ఎంఐఎం) పార్టీతో అంటకాగినందుకు ముక్కు నేలకురాసి యావత్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పండి.’’అని సూచించారు.‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తలారా…. దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేస్తే మీ పేరు చరిత్రలో నిలిచిపోతోంది. కానీ కేసీఆర్, ఒవైసీ, నకిలీ గాంధీ కుటుంబాల అవకాశవాద రాజకీయాల కోసం మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి’’అని హితవు పలికారు.
Minister Nadendla Manohar: ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకం
తాజావార్తలు
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!