Asaduddin Owaisi: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ సింగ్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ధ్వజమెత్తారు. సీఎం మోహన్ యాదవ్ ‘‘ఖానా బజానా’’ వ్యాఖ్యలపై బీజేపీపై ఓవైసీ ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలపై విరుచుపడిన ఓవైసీ ‘‘”హమ్ కిసీ కె బాప్ కా నహీ ఖాతే. యే దేశ్ హుమారా హై, ముఖ్యమంత్రి ఆప్ హుమే అప్నీ జెబ్ సే నహీ ఖిలా రహే” అని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ దేశం అందిరికి చెందుతుందని, ముఖ్యమంత్రి మా బిల్లులను చెల్లించడం లేదని, మా ఖర్చుల్ని మేమే భరిస్తున్నామని, ఎవరి సహాయం కోరడం లేదని అన్నారు.
Read Also: Mohan Bhagwat: ASL భద్రత అంటే ఏమిటి.? ఆర్ఎస్ఎస్ చీఫ్‌కి అమిత్ షాతో సమానంగా భద్రత పెంపు..
భారతదేశంలో సంపద అసమాన పంపిణీని లేవనెత్తిన ఓవైసీ.. దేశంలోని సంపద, వనరులు, ఆస్తి కొందరి వద్దే ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో సంపద అసమానతలు లేకుండా సంపద పంపిణీ జరగాలని సూచిస్తుందని అది ఎందుకు అమలు కావడం లేదని అడిగారు. దేశం సంపదలో 60 శాతం కేవలం 5 శాతం మంది వద్దే ఎందుకు ఉందని దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలు పోషకాహార లోపాలతో బాధపడుతున్నా.. బడా పారిశ్రామికవేత్తలు అవసరాలను మాత్రం బీజేపీ తీరుస్తోందని ఆరోపించారు.
అంతకుముుందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చందేరీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘జాగ్రత్తగా వినండి. కొందరు ఇక్కడ తిండి తింటూ, ఇతరులకు విధేయత చూపిస్తారు, దీనిని మేం అనుమతించం’’ అని అన్నారు. ప్రతీ ఒక్కరికి కూడా తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేస్తూనే, దీని కన్నా దేశం ముఖ్యమంత్రి చెప్పారు.
https://twitter.com/imShamsulHaque/status/1828350427303141830