లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగజ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.15 కోట్ల మేర అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు తేల్చారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. కోటిన్నర రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. ఫ్లాట్లు, ఫ్లాట్, ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. అరెస్ట్ అనంతరం ఆమెను…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లో హనీ ట్రాప్ చేసి రాము సింగోటం అనే వ్యక్తిని ఓ ముఠా హత్య చేసింది. మహిళ ద్వారా ట్రాప్ చేయించి రాము సింగోటంని జూబ్లీహిల్స్ పిలిపించి.. జూబ్లీహిల్స్ కి వచ్చిన గోల్డ్ మాన్ రాము సింగోటంపై ముకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. మహిళతో పాటు ఆమె కూతుర్ని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు రాము సింగోటం. ఈ క్రమంలో.. రౌడీ…
హైదరాబాద్‌లో వివిధ బ్లడ్ బ్యాంకులలో డ్రగ్ కంట్రోల్ దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్.ఆర్ బ్లడ్ బ్యాంక్‌లో సోదాలు చేపట్టారు. హ్యూమన్ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్న ముఠాను గుర్తించారు. దీంతో భారీగా ప్లాస్మా యూనిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
జేఏ యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీలో ఏపీ సీఐడీ అధికారులమంటూ కంపెనీలోకి పది మంది వెళ్లినట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. ఐటీ కంపెనీ యజమాని దగ్గర నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలను నకిలీ ఏపీ సిఐడి అధికారులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
రేపు (సోమవారం) అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సుమారు 41 రోజుల నుంచి అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. గత ఐదు రోజులుగా విజయవాడలో అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్ష నేతలు, కార్మిక సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సీపీఎం నేత బాబురావును హౌస్ అరెస్ట్ చేశారు. కాగా.. నగరంలోకి…
Film Nagar: ఫిలింనగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏకంగా వివాహతను ప్రేమించి ఇబ్బందులకు గురిచేశాడు. వివాహితను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు.
శ్రీలంక నావికాదళం 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. అంతేకాకుండా.. దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడటం కోసం వాడే వారి పడవలను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర జాఫ్నా ద్వీపంలోని కరైనగర్ తీరంలో శనివారం మత్స్యకారులను అరెస్టు చేసి, వారి మూడు పడవలను స్వాధీనం చేసుకున్నట్లు నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి చర్యల నిమిత్తం ఈ మత్స్యకారులను కంకేసంతురై ఓడరేవుకు తరలించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కత్తిపోట్లకు సంబంధించిన ఘటనలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా.. ఆగ్నేయ ఢిల్లీలోని బదర్‌పూర్ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి ఓ వ్యక్తిపై ఐదుగురు యువకులు కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అయితే.. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి.. వారిపై అనుమానంతో నిందితులని వెంబడించి పట్టుకున్నారు. ఈ ఘటన అర్థరాత్రి 2:30 గంటల తర్వాత జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై డీసీపీ సౌత్ ఈస్ట్…
చెన్నైలో 28 ఏళ్ల క్రితం భార్య విడాకుల ఫిర్యాదుతో అత్తను హతమార్చిన వ్యక్తిని బెర్హంపూర్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు చాలారోజులుగా వెతుకుతుండగా.. మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు హరిహర్ పట్టాజోషి (51) కోసం వారం రోజులపాటు నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గోసానినుగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు దాక్కున్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నట్లు బెర్హంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వివేక్ ఎం శరవణ…
బీఆర్ఎస్ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా అచ్చంపేటకు వస్తున్న క్రమంలో వెల్దండ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టుకు గల కారణాలు తెలియకపోవడంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్డండ పీఎస్ కు భారీగా తరలి వచ్చారు. స్టేషన్ ముందు వారు ఆందోళనకు దిగారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని పార్టీ కార్యకర్తలు పీఎస్ ముందు బైఠాయించి…