సాధారణంగా సినిమాల్లో ఎవరినైనా ఇరిక్కించాలి అనుకుంటే పోలీసులే వాళ్లింట్లో డ్రగ్స్, గన్స్ పెట్టి వెంటనే వచ్చి సెర్చ్ అంటూ ఇళ్లంతా వెతికేయడం తరువాత వారిని అరెస్ట్ చేయడం లాంటి సీన్లు చూస్తుంటాం. తరువాత వాళ్ల మీద కసినంతా తీర్చుకుంటారు. ఉత్తరప్రదేశ్ మీరట్ లో కూడా సేమ్ అలాంటి సీన్ ఒకటి జరిగింది. అయితే వీళ్లు డ్యూటీ కంటే సినిమాలు ఎక్కువ చూస్తారేమో..అందుకే పాపం పక్కాగా ప్లాన్ చేయలేక పట్టుబడిపోయారు. ఎలా ఇరికించాలో నేర్చుకున్నారు కానీ దాని వల్ల…
ఉత్తరప్రదేశ్ లో ఓ సంఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కిడ్నాపర్లు అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బాలుడి పేరెంట్స్ కు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన ముష్కరులలో దీపాంశు అలియాస్ మోను, మొయినుద్దీన్ అలియాస్ సల్మాన్ ఉన్నారు. వీరిద్దరూ సల్మాన్ త్యాగి గ్యాంగ్‌కు చెందినవారు కాగా.. సల్మాన్ త్యాగికి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో బాలికను వేధించాడనే ఆరోపణతో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను స్థానికులు చితకబాదారు. ఈ ఘటన ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్ బర్హాన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఒంటిపై దుస్తులు తొలగించి స్తంభానికి కట్టేసి కొట్టారు.
రాజస్థాన్ పేపర్ లీక్ కేసులో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. రాజస్థాన్ పబ్లిక్ కమిషన్ సభ్యులు అనిల్ కుమార్ మీనా, బాబులాల్ కటారాలను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. మూడు రోజుల పాటు ఈడీ కస్టడీ కోరింది.
మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పై గౌహతి పోలీస్ కమిషనర్ దిగంత బోరాహ్ మాట్లాడుతూ.. నిందితులు హెరాయిన్ ను సుబ్బుపెట్టెల్లో ఉంచి రహస్యంగా తరలించేందుకు ప్రయత్నించారని.. కాగా తమకు అందిన రహస్య సమాచారం ఆధారంగా నిందితులని పట్టుకున్నామని వెల్లడించారు.
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి, రిచెస్ట్ సీఎం.. కానీ ఏమి పని చేశాడో తెలియదని విమర్శించారు. హఠాత్తుగా ఆస్తులు పెంచేసుకుని, అక్రమంగా డబ్బులు సంపాదించిన వారంతా రాజ్యాధికారం దక్కించుకున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన అంశంలో తన మద్దతు ఉంటుందని చెప్పారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్‌పై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాలకు తెలియకుండా చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయగలరా అని వ్యాఖ్యానించారు. అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు.