Hyderabad: హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠా అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో వివిధ బ్లడ్ బ్యాంకులలో డ్రగ్ కంట్రోల్ దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. హ్యూమన్ ప్లాస్మా అమ్మకాల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్.ఆర్ బ్లడ్ బ్యాంక్‌లో సోదాలు చేపట్టారు. హ్యూమన్ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్న ముఠాను గుర్తించారు. దీంతో భారీగా ప్లాస్మా యూనిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్‌లో తనిఖీలు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్స్‌లోనూ డ్రగ్ అధికారుల సోదాలు చేపట్టారు. భారీగా అక్రమ నిల్వలు, అపరిశుభ్రమైన హ్యూమన్ బ్లడ్, ప్లాస్మా యూనిట్స్ పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Also: Bjp: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మాకొట్టడంపై బీజేపీ విమర్శ
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
మరోవైపు.. మూసాపేటలో రక్తంలోని ప్లాస్మా అక్రమంగా విక్రయిస్తున్న హేమో సర్వీస్ లాబొరేటరీస్ అనే సంస్థ పై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడి చేశారు. కాగా.. అక్రమంగా రక్తం, ప్లాస్మా, సీరం విక్రయిస్తున్న ఆర్.రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు. ఆర్.రాఘవేంద్ర నాయక్ 2016లో మూసాపేట భవాని నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్రమంగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి పలు బ్లడ్ బ్యాంకుల నుండి 700 నుండి 1000 రూపాయలకు రక్తము సేకరించి, వాటి నుండి రక్తము, ప్లాస్మా, సీరం వేరు చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఈ బ్లడ్ బ్యాంక్ పై పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఈ రోజు దాడి చేశారు. బ్లడ్ బ్యాంకుకు అనుమతులు లేకపోవటమే కాకుండా నిట్ నేస్ లేని పరిసరాల్లో రక్తాన్ని వేరు చేసిన ప్లాస్మా బ్యాగులు, రక్తం బ్యాగులు, ఫ్రిడ్జ్ లో నిలువ ఉంచిన రక్తం, సీరం, ప్లాస్మాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: Harish Rao: ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తాగు, సాగునీటి కష్టాలు తప్పవు..
తాజావార్తలు
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!