Guvvala Balaraju: బీఆర్ఎస్ నేత, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా అచ్చంపేటకు వస్తున్న క్రమంలో వెల్దండ వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టుకు గల కారణాలు తెలియకపోవడంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్డండ పీఎస్ కు భారీగా తరలి వచ్చారు. స్టేషన్ ముందు వారు ఆందోళనకు దిగారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని పార్టీ కార్యకర్తలు పీఎస్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.
Read Also: Pallavi Prashanth : బరితెగించిన అభిమానులు.. కప్ కొట్టిన పల్లవి ప్రశాంత్ కి షాక్ ఇచ్చిన పోలీసులు
కాంగ్రెస్ ప్రభుత్వం తమ నాయకుడిని వేధిస్తోందని, కావాలనే ఆయనను అరెస్టు చేయించిందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అచ్చంపేట పర్యటనకు తమకు అవకాశం ఇవ్వాలని గువ్వల బాలరాజు, ఆయన అనుచరులు డిమాండ్ చేశారు.
Read Also: Aadikeshava : మరో మూడు రోజులలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్న ఆదికేశవ..?