జర్నలిస్టులపై జరుగుతున్న అగాయిత్యలపై జాతీయ బీసీ కమీషన్ సభ్యులు టీ. ఆచారి ఫైర్ అయ్యారు. జర్నలిస్ట్ రఘును తీవ్రవాదిలా రిక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసి అరెస్ట్ చేయటంపై నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇలా వ్యవహరించటం సిగ్గుచేటు అని..చట్టాన్ని రక్షించాల్సిన వారే అడ్డదారిలో వెళ్ళటం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు అని మండిపడ్డారు. కేసులో ముద్దాయిగా ఉంటే నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు అని..గతంలో ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావ్ ను కూడా ఖమ్మంలో కిడ్నాప్ చేసి అరెస్ట్…
తమిళనాడులోని కరూర్ జిల్లా కుప్పుచ్చిపాలయంకు చెందిన గుణశేఖరన్.. ఆయన కుమారుడు జగదీశ్‌తో కలిసి ఇంట్లో మద్యం తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వారి నుంచి 8 లిక్కర్ బాటిళ్లు, తయారీకి వినియోగించే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాము తాగేందుకే తయారీ ప్రారంభించమని తెలిపారు. మిగిలిన మద్యాన్ని ఇతరులకు విక్రయిస్తున్నామని పోలీస్ ఎంక్వైరీలో తెలిపారు. అంతేకాదు, యూట్యూబ్ వీడియో చూసి వారు ఆల్కహాల్ తయారు చేస్తున్నట్లు అధికారులకు తెలిపారు. ఈమేరకు ఆ తండ్రీకొడుకులను తమిళనాడు పోలీసులు అరెస్టు…
వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి మార్కెట్లో చెలామణి చేస్తున్న దంపతులను టాస్క్ఫోర్స్ మరియు ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. వారి నుండి సుమారు 10లక్షల 9వేల 960 రూపాయల నకిలీ కరెన్సీని సీజ్ చేశారు పోలీసులు.. వారి నుండి కరెన్సీని ముద్రించేందుకు వినియోగిస్తున్న కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, ఒక కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే… వరంగల్ కాశిబుగ్గ, తిలకోడ్ ప్రాంతానికి చెందిన వంగరి రమేష్,…
బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో సిద్ధార్థ పితాని అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌లో సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేసి ముంబైకి తరలించింది ఎన్సీబీ. సుశాంత్ ప్లాట్‌లో మూడేళ్లపాటు ఉన్న సిద్ధార్థ్.. డ్రగ్స్ కేసులో సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించింది ఎన్సీబీ. ఆత్మహత్యకు ముందు చివరి సారి సిద్ధార్థ్‌తో మాట్లాడారు సుశాంత్. సుశాంత్‌కు పీఆర్ మేనేజర్‌గా కూడా సిద్ధార్థ్ పనిచేశారు. సిద్ధార్థ్ పితానిని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 26న ముంబై NCB అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సుశాంత్ కేసులో…
కర్నూలు జిల్లా.. బనగానపల్లె టిడిపి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి చేసిన ఘటనలో జనార్దన్ రెడ్డితో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు భారీ ఎత్తున మోహరించారు పోలీసులు. దీంతో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. టిడిపి కార్యకర్తల్లో భయాందోళనలు, సృష్టించేందుకే పోలీసుల…
రెమిడెసీవర్ ఇంజెక్షన్ లను పక్కదారి పట్టిస్తున్న మరో ముఠాను అరెస్ట్ చేసారు ఏపీ పోలీసులు. ఆశ్రం కొవిడ్ కేర్ హాస్పిటల్ నుండి రెమిడెసివర్ ఇంజక్షన్ లను పక్కదారి పట్టిస్తున్నారు పదిమంది ముఠా సభ్యులు. ఆ ముఠా దగ్గర నుండి 40 రెమిడెసివర్ ఇంజెక్షన్లు, 1లక్ష 45 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల వ్యవదిలో రెమిడెసివర్ ఇంజక్షన్ లను పక్కదారి పట్టించి అమ్ముకుంటున్న మూడు ముఠా లను అరెస్ట్ చేసారు. అయితే పోలీసులు కొరడా దుళిపిస్తున్న…
హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రములో కేసీఆర్ కు మద్దుతుగా ప్రెస్ మీట్ పెట్టు తుండగా ఈటల వర్గీయులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మద్య తోపులాట జరిగింది. దాంతో ఈటల వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేసారు. కరోనా సమయంలో నిబందనలు ఉల్లఘించి మద్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని ప్రశ్నిచారు ఈటెల వర్గీయులు. తమకు 10 గంటల లోపే అనుమతి అని చెప్పి ఇప్పుడు పోలిసులు ఎలా పరిమిషన్ ఇచ్చారని ప్రశ్నించిన ఈటెల వర్గం… గ్రామంలో కరోనా…
ప్రముఖ యాంకర్ శ్యామల భర్త, బుల్లితెర నటుడు నరసింహారెడ్డి మంగళవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఖాజాగూడకు చెందిన సింధూర రెడ్డి అనే మహిళ నరసింహారెడ్డి తన దగ్గర కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన నరసింహ రెడ్డి ఈ విషయంపై స్పందించిన వీడియోను శ్యామల తన ఇన్స్టాగ్రామ్…
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్‌టాక్ భార్గవ్ ను దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.అయితే అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వచ్చే నెల మూడో తేదీ వరకు రిమాండ్ విధించారు. అసలు వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన భార్గవ్ “ఫన్ బాస్కెట్ ” పేరుతో టిక్ టాక్ వీడియోలు చేసేవాడు. టిక్ టాక్ నిషేధించడంతో మోజో,…