Film Nagar: ఫిలింనగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏకంగా వివాహతను ప్రేమించి ఇబ్బందులకు గురిచేశాడు. వివాహితను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు. వివాహిత ఇంటికెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. వివాహిత భర్త అడ్డం రావడంతో అతన్ని చంపి పారిపోయాడు.
లండన్ లో ఫిలింనగర్ లో ఉంటున్న వివాహిత, అద్నాన్ కలిసి చదువుకున్నారు. వారిద్దరి మధ్య వున్న స్నేహం ప్రేమగా మార్చుకున్నాడు అద్నాన్. అయితే ఆమె మాత్రం అద్నాన్ కు తనకు పెళ్ళైందని, తన భర్త అనుమతితోనే లండన్ కు చదువుకునేందుకు వచ్చానని, భర్తను వదిలే ప్రసక్తే లేదని అద్నాన్ తో చేప్పేది. తన ముందు సరే ఇద్దరం స్నేహితుల్లాగే ఉందామని ఒప్పుకున్నట్లు నటించాడు అద్నాన్. దీంతో ఆమె కూడా అతన్ని నమ్మింది. తనతో సాన్నిహిత్యం ఉండటం మొదలు పెట్టింది. ఇద్దరు మధ్య ఉన్న సానిహిత్యంతో తీసుకున్న ఫోటోలు తీసుకున్నారు. అయితే ఇదే సరైన సమయమని భావించిన అద్నాన్ తనని పెళ్లి చేసుకోవాలని, భర్తను వదిలేయాలని కోరాడు. తనను వివాహం చేసుకోకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. అయినా దానికి వివాహిత భయపడకుండా.. తన భర్తను వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది.
Read also: V. Hanumantha Rao: రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు.. వీలైనప్పుడల్లా అయోధ్యను సందర్శిస్తాం
చదువు పూర్తి అయిన తర్వాత హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కు వచ్చింది. లండన్ లో జరిగిన విషయాలన్నీ తన భర్త గౌస్ కు వివరించగా భయపడాల్సిన పనిలేదని భార్యకు ధైర్యం చెప్పాడు. అద్నాన్ వివాహితను మరచిపోలేక పోయాడు.. ఆమెను కిడ్నాప్ చేసి పెళ్ళి చేసుకోవాలని ప్లాన్ వేశాడు. వివాహిత ఇంటికి వచ్చాడు అద్నాన్.. ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. వివాహితన కేకలు వేయడంతో గౌస్ అడ్డు పడ్డాడు. ఇద్దరు మధ్య గొడవ మొదలైంది. అయితే అద్నాన్ తన వద్ద వున్న కత్తితో గౌస్ పై దాడి చేశాడు. కిరాతంగా చంపి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రేమోన్మాది అద్నాన్ తో పాటు మరొకరికి అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గౌస్ ను విగతజీవిగా చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇన్ని రోజులు భర్తకు దూరంగా లండన్ ఉండి, తనతో ఆనందగా గడిపేందుకు హైదరాబాద్ వచ్చిన వివాహితకు కన్నీల్లే తోడయ్యాయి. భర్త హత్యను కల్లారా చూసి భార్య విగతజీవిగా మిగిలిపోయింది. అద్నాన్ కఠినంగా శిక్షించాలని వివాహిత కోరింది.
Telangana Govt: ఆరిజన్ లైఫ్ సైన్స్ తో రూ.2000 కోట్ల డీల్ కుదుర్చుకున్న తెలంగాణ సర్కార్