హైదరాబాద్ జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లో హనీ ట్రాప్ చేసి రాము సింగోటం అనే వ్యక్తిని ఓ ముఠా హత్య చేసింది. మహిళ ద్వారా ట్రాప్ చేయించి రాము సింగోటంని జూబ్లీహిల్స్ పిలిపించి.. జూబ్లీహిల్స్ కి వచ్చిన గోల్డ్ మాన్ రాము సింగోటంపై ముకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. మహిళతో పాటు ఆమె కూతుర్ని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు రాము సింగోటం. ఈ క్రమంలో.. రౌడీ షీటర్లకు చెప్పి రాము సింగోటంని హత్య చేయించింది మహిళ. రాముని హత్య చేసిన తర్వాత ఆధారాలు బయటపడకుండ ఉండేందుకు బాణాసంచా కాల్చింది ముఠా.
Supriya Sule: ఫోన్‌పే, గూగుల్‌పే పేలబోయే “టైమ్ బాంబులు”.. పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు..
ఈ ఘటనపై జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ మీడియాకు వివరాలను వెల్లడించారు. పాతకక్షలు, అసూయ కారణంగానే తోటి స్నేహితుడు పథకం ప్రకారం దారుణంగా అంతమొందించినట్టు తెలిపారు. జీడిమెట్లకు చెందిన మణికంఠ, రాము ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ మరికొంత మందితో కలిసి ‘జువా’ గేమ్ ఆడేవారని, దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని అన్నారు. తరచూ గేమ్‌లో రాము డబ్బులు గెలవడంతో మణికంఠ కక్ష పెంచుకున్నాడని.. గతంలో వీరిద్దరి మధ్య గొడవ జరగిందని తెలిపారు. దీంతో.. రాము మణికంఠపై దాడి చేశాడన్నారు. అప్పటి నుంచి మరింత కక్ష పెంచుకున్నాడని.. రామును హత్య చేయాలని పథకం ప్రకారం హిమాంబి, నజీమా అనే మహిళలతో హనీట్రాప్ చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. మహిళలు రాముకు ఫోన్ చేసి రమ్మనడంతో అతను యూసఫ్‌గూడలోని ఎల్‌ఎన్ నగర్‌కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన మణికంఠ, వినోద్, మహమ్మద్ ఖైసర్, శివకుమార్, నిఖిల్, తున్నా కుమార్, మరో ఐదుగురు కలిసి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఇందుకు ఇద్దరు మహిళలు సహకరించారని ఏసీపీ తెలిపారు.