iPhone 15 Release Date and Price: ‘యాపిల్’ కంపెనీ గతేడాది ఐఫోన్ 14 సిరీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. పలు నివేదికల ప్రకారం… 15 సిరీస్‌ను…
Purchase Apple iPhone 14 Plus Only RS 76999 in Amazon Apple Sale Days: ‘యాపిల్’ కంపెనీ నిత్యం కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. గతేడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేయనుంది.…
Apple యొక్క iOS 17 అధికారికమైనది, WWDC 2023 యొక్క కీనోట్ స్టేజ్‌లో అరంగేట్రం చేస్తోంది. హైలైట్లలో కొత్త భద్రతా ఫీచర్లు, అంతర్నిర్మిత జర్నలింగ్ యాప్, కొత్త నైట్‌స్టాండ్ మోడ్, రీడిజైన్ చేసిన కాంటాక్ట్ కార్డ్‌లు, మెరుగైన ఆటో-కరెక్ట్, వాయిస్ ట్రాన్స్క్రిప్షన్, లైవ్ వాయిస్‌మెయిల్ ఉన్నాయి. మీరు “హే సిరి” నుండి “హే”ని వదలగలరు. మీ కాంటాక్ట్ బుక్ పోస్టర్లు అనే కొత్త ఫీచర్‌తో అప్డేట్ను పొందుతోంది. ఇది కాంటాక్ట్ కార్డ్‌లను సరికొత్త ఇమేజ్‌లుగా మారుస్తుంది.…
Tim Cook: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు టెక్ సంస్థల్ని, దాని ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం పలు కంపెనీల ఆదాయాలు తగ్గేందుకు కారణం అయ్యాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు పెద్ద ఎత్తు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు మాస్ లేఆఫ్స్ ను ప్రకటించాయి. గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తో పాటు అనేక ఐటీ కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Apple Record Revenue: భారతదేశంలో ఆపిల్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా త్రైమాసిక ఫలితాలను సాధించిందని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశం అద్భుతమైన మార్కెట్ అంటూ కొనియాడారు. ఐఫోన్ తయారీ సంస్థ అయిన ఆపిల్ ఇటీవలే భారతదేశంలో రెండు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. ఏడేళ్ల తర్వాత ఇటీవల టిమ్ కుక్ భారతదేశ పర్యటకు వచ్చారు. ముంబై, ఢిల్లీ నగరా్లలో రిటైల్ మార్కెట్ ను ప్రారంభించారు.…
భారత్ లో పర్యటిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఫస్ట్ ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆపిల్ యొక్క రెండవ స్టోర్ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీతో యాపిల్ సీఈఓ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ ఐఫోన్, ఉత్పత్తులపై భారతీయుల క్రేజ్ అందరికీ తెలిసిందే. దేశంలో కంపెనీ అమ్మకాలు పెరగడానికి అదే కారణమని చెప్పవచ్చు. యాపిల్ తన మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను భారతదేశంలో త్వరలో ప్రారంభించనుంది.
Apple: ఆర్థిక మాంద్యం భయాలు, తగ్గుతున్న ఆదాయాలతో పలు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు తన ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాల్లో కూడా కోత పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, ట్విట్టర్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగులు తొలగించాయి. ఖర్చులను అదుపులో ఉంచేందుకు కంపెనీలు అన్ని పొదుపు చర్యలను పాటిస్తున్నాయి.
Oil giant Saudi Aramco: అంతర్జాతీయంగా పేరొందిన సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ సంస్థ.. ఆరామ్కో.. ఇంతకుముందు ఎన్నడూలేనంతగా గొప్పగా రాణించింది. గతేడాది ఏకంగా 13 పాయింట్ రెండూ సున్నా లక్షల కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించింది. తద్వారా.. తన రికార్డులను తానే తిరగరాసుకుంది. అంతేకాదు.. యాపిల్, వొడాఫోన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతోపాటు ఎక్సాన్ మొబిల్, షెల్ తదితర అమెరికా సంస్థలు 2022లో నమోదుచేసిన ప్రాఫిట్స్‌ని అధిగమించింది.