Apple Users In India To Get 5G From Next Week: భారతదేశంలోని ఆపిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 5 జీ సేవల గురించి క్లారిటీ ఇచ్చింది. 5 జీ నెట్ వర్క్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను వచ్చే వారం నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆపిల్ తన ఐఓఎస్ 16 బీటా సాఫ్ట్వేర్ అప్డేట్ను అందుబాటులోకి తెస్తోంది.
దేశంలో 5జీ సేవలు సజావుగా అందేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు, టెలికాం నెట్వర్క్ సంస్థలతో టెలికాం-ఐటీ ఉన్నతాధికారులు బుధవారం సమావేశం నిర్వహించనున్నారు.
9 ఏళ్ల భారతీయ బాలిక ఐఓఎస్ యాప్ తయారుచేసి అందరినీ ఔరా అనిపించింది. దుబాయ్‌లో ఉండే ఈ బాలిక టెక్నాలజీని వినియోగించియాప్ తయారుచేసిన తీరు పట్ల ఐఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కూడా విస్మయం చెందారు.
టెక్ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్లకు సంబంధించి ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌కు స్వల్ప మార్పులు చేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 16ను ఆవిష్కరించింది. కొత్తకొత్త ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో దీన్ని తీర్చిదిద్దింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022 సందర్భంగా ఐఓఎస్ 16 (iOS 16)ను ప్రవేశపెట్టింది యాపిల్. ఐఫోన్ 8 సిరీస్ ఆ తర్వాతి మోడల్స్ అన్నింటికీ కొన్ని నెలల్లో ఐఓఎస్ 16 అప్డేట్ వస్తుంది. సెప్టెంబర్‌లో ఈ కొత్త వెర్షన్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం…
Apple WWDC 2022 ఈవెంట్ త్వరలోనే జరగనున్న నేపథ్యంలో.. ఆ సంస్థ ఎలాంటి ఎలాంటి అప్డేట్స్తో ముందుకు రానుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మొత్తానికి అంచనాలకి తగినట్టుగానే యాపిల్ సంస్థ ఐఫోన్ల కోసం ఐఓఎస్ 16 అప్డేట్ను తీసుకురానుంది. నోటిఫికేషన్స్ దగ్గర నుంచి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్‌కు ఈ కొత్త అప్డేట్ ఉపకరిస్తుందని తెలుస్తోంది. గత వర్షన్స్ కంటే ఈ కొత్త వర్షన్ మరింత మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. కాకపోతే.. విజువల్లీ ఇది ఐఓఎస్ 15నే పోలి…
ప్రముఖ కంప్యూటర్, మొబల్ ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్ సంస్థ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నది. యాపిల్ అటోనమస్ పేరుతో ఈ కారును తయారు చేసింది. భారత సంతతికి చెందిన దేవాంగ బొర అనే మెకానికల్ ఇంజనీర్ ఈ కారును డిజైన్ చేశారు. పెద్దని గుండ్రంగా ఉన్న గోళం దానికి నాలుగు చక్రాలు ఉన్న అటోనమస్ చూసేందుకు అచ్చంగా పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉన్నది. ఈ ఎలక్ట్రిక్ కారుకు డ్రైవర్ అవసరం లేదు.…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రంగాలు కరోనా దెబ్బకు విలవిలలాడిపోయాయి. చిప్‌ల కొరతతో కార్ల కంపెనీలు ఉత్పత్తి తగ్గిపోయింది. సుమారు 7 లక్షల కార్లను ఇంకా డెలివరీ చేయాల్సి ఉన్నది. అయితే, చిప్‌ల కొరత వేధిస్తున్నప్పటికీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మూడు పుప్వులు ఆరు కాయలుగా సాగింది. 2020ని మించి అమ్మకాలు జరిగాయి. 2021లో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 38…
అదృష్టం ఎప్పుడు ఎలా ఎవర్ని వరిస్తుందో చెప్పలేం. ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం తలుపు తడుతుంది. తెరిస్తే అదృష్టవంతులే.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు. కొంతమందికి అదృష్టం సముద్రం రూపంలో కలిసి వస్తుంది. ఎప్పటిలాగే ఓ మత్స్యకారుడు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి వల విసిరాడు. కాసేపటికి వలకు ఏదో చిక్కినట్టు అనిపించింది. వలను పైకి లాగే ప్రయత్నం చేశాడు. బరువుగా అనిపించడంతో ఏదోలా వలను కష్టపడి పైకి లాగాడు. వలలో చేపలకు బదులాగా కొన్ని అట్ట పెట్టెలు…