Purchase Apple iPhone 14 Just Rs 30900 in Flipkart Campus Deal: ‘యాపిల్’ తన ఐఫోన్ 15 సిరీస్‌ను మరో కొన్ని నెలల్లో విడుదల చేయనుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఐఫోన్ 14 సిరీస్ బాగా పాపులర్ అయింది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు భారత మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ 2023 చివరికల్లా 15 సిరీస్‌ను లాంచ్ చేయనున్న నేపథ్యంలో ఐఫోన్ 14పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ 14ని కేవలం రూ. 30,900కే సొంతం చేసుకోవచ్చు. పలు ఆఫర్ల ద్వారా రూ. 35,000 దాకా భారీ తగ్గింపు లభిస్తోంది. ఆ వివరాలను ఓసారి చూద్దాం.
iPhone 14 Offers:
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ‘క్యాంపస్ డీల్’ను అందిస్తోంది. ఐఫోన్ 14 (128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 69,999కి అందుబాటులో ఉంది. ఇది అధికారిక స్టోర్ ధర కంటే రూ. 9,901 తక్కువ. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగిస్తే.. అదనంగా రూ. 4,000 తగ్గింపును పొందవచ్చు. అప్పుడు ఐఫోన్ 14 ధర రూ. 65,999గా ఉంటుంది.
iPhone 14 Exchange Offer:
ఐఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్‌ను విక్రయించడం ద్వారా రూ. 35,000 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్ బాగుంది, ఎలాంటి డామేజ్ లేకుంటే ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ మొత్తం పొందవచ్చు. అంటే బ్యాంక్ ఆఫర్‌లు మరియు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ల అనంతరం ఐఫోన్ 14ని కేవలం రూ. 30,999కి సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో అసలు ధర నుంచి రూ. 48,901 భారీ తగ్గింపు లబిస్తుంది.
iPhone 14 Specifications:
# 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్ ప్లే
# 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
# 2532×1170 పిక్సెల్స్ రిజల్యూషన్
# యాపిల్ ఏ15 బయోనిక్ చిప్ సెట్
# ఐఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టం
# 5జీ సపోర్ట్
# 12 మెగా పిక్సెల్ బ్యాక్ మెయిన్ కెమెరాతో పాటు 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
# 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 3279 ఎంఏహెచ్ బ్యాటరీ
Also Read: BCCI Chief Selector: శాలరీ తక్కువని.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవిని వద్దనుకున్న భారత దిగ్గజం!