ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ ఐఫోన్, ఉత్పత్తులపై భారతీయుల క్రేజ్ అందరికీ తెలిసిందే. దేశంలో కంపెనీ అమ్మకాలు పెరగడానికి అదే కారణమని చెప్పవచ్చు. యాపిల్ తన మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను భారతదేశంలో త్వరలో ప్రారంభించనుంది.
Apple: ఆర్థిక మాంద్యం భయాలు, తగ్గుతున్న ఆదాయాలతో పలు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు తన ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాల్లో కూడా కోత పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, ట్విట్టర్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగులు తొలగించాయి. ఖర్చులను అదుపులో ఉంచేందుకు కంపెనీలు అన్ని పొదుపు చర్యలను పాటిస్తున్నాయి.
Oil giant Saudi Aramco: అంతర్జాతీయంగా పేరొందిన సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ సంస్థ.. ఆరామ్‌కో.. ఇంతకుముందు ఎన్నడూలేనంతగా గొప్పగా రాణించింది. గతేడాది ఏకంగా 13 పాయింట్ రెండూ సున్నా లక్షల కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించింది. తద్వారా.. తన రికార్డులను తానే తిరగరాసుకుంది. అంతేకాదు.. యాపిల్, వొడాఫోన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతోపాటు ఎక్సాన్ మొబిల్, షెల్ తదితర అమెరికా సంస్థలు 2022లో నమోదుచేసిన ప్రాఫిట్స్‌ని అధిగమించింది.
Pre-Installed Apps: స్మార్ట్ ఫోన్ల విషయంలో కేంద్రం కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. స్మార్ట్ ఫోన్లలో ముందగానే ఇన్ బిల్ట్ గా ఉంటున్న ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా పరంగా సమస్యలు తలెత్తె అవకాశం ఉండటంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గూఢచర్యం, యూజర్ డేటా దుర్వినియోగం గురించి ఆందోళన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది.
iPhone-Foxconn: ఆపిల్ భాగస్వామి ఫాక్స్ కాన్ భారత్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా నుంచి తమ వ్యాపారాన్ని ఇతర దేశాలకు మళ్లించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా ఉన్న చైనాకు ఇది పెద్ద దెబ్బగా నిపుణులు పరిగణిస్తున్నారు. స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు భారత్ తో కొత్తగా సుమారు 700 మిలియన్ డాలర్లతో అంటే సుమారుగా రూ.5700 కోట్లతో ఫ్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.
Apple: ప్రపంచం ఆర్థికమాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా, యూరోపియన్ మార్కెట్లు ఆశాజనకంగా లేవు. 6 నెలల నుంచి ఏడాది వ్యవధిలో మాంద్యం ఎప్పుడైనా రావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఒక్క భారత ఆర్థిక పరిస్థితి మాత్రమే ఆశాజనకంగా ఉంటుందని ఐఎంఎఫ్ తో పాటు పలు ఆర్థిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి.
Apple makes history: ఎగుమతుల్లో ఆపిల్ సంస్థ రికార్డ్ క్రియేట్ చేసింది. భారతదేశం నుంచి రికార్డ్ స్థాయిలో ఐఫోన్లను ఎగుమతి చేసి చరిత్ర సృష్టించింది. ఏకంగా భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఆపిల్ 2022 డిసెంబర్ నెలలో రూ. 8100 కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసి సత్తా చాటింది. మొత్తం భారత్ తో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులను రూ. 10,000 కోట్లకు తీసుకెళ్లింది. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్…
Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానం దక్కించుకుంది. గతేడాది యాపిల్ తొలి స్థానంలో నిలవగా..ఈ ఏడాది అమెజాన్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంది.
Best Companies In US: డబ్బు విషయం పక్కపెడితే.. చేసే పనిలో ఇష్టం, మానసిక ప్రశాంతత ఉండాలని ప్రతీ ఉద్యోగి కోరుకుంటారు. అలాగే కోట్లు సంపాదించినా ఆరోగ్యం పాడైతే తిరిగి తెచ్చుకోలేము.