CEO Salary: ఆర్థికమాంద్యం భయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ ఈ టెక్, ఇతర రంగ కంపెనీల CEO ల జీతం నిరంతరం పెరుగుతోంది. గణాంకాల ప్రకారం సాధారణ ఉద్యోగి, సీఈవోల జీతంలో 18 నుంచి 20 రెట్లు ఎక్కువ వ్యత్యాసం ఉంది. Equilar నివేదిక ప్రకారం… 2022లో Google మాతృ సంస్థ ఆల్ఫాబెట్ CEO అయిన సుందర్ పిచాయ్ జీతం ఇతర అలవెన్సులుగా రూ. 1855 కోట్లు అందుకున్నారు. కాగా గూగుల్ ఉద్యోగి సగటు వేతనం రూ.2.29 కోట్లు. సాధారణ Google ఉద్యోగి CEO జీతం పొందడానికి 808 సంవత్సరాలు పడుతుంది. 2021లో సుందర్ పిచాయ్ జీతం రూ.51.88 కోట్లు మాత్రమే. అది కూడా ఉద్యోగుల సగటు జీతం కంటే 21 రెట్లు ఎక్కువ.
Read Also: Vegetable Prices Hike: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. వెలవెలబోతున్న మార్కెట్లు!
మరికొన్ని గ్లోబల్ కంపెనీల సీఈవోల వేతనాన్ని పరిశీలిస్తే.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వార్షిక వేతనం రూ.1.92 లక్షల కోట్లు కాగా, టెస్లా ఉద్యోగి సగటు వేతనం రూ.1.22 కోట్లు. యాపిల్ సీఈవో టిక్ కుక్ వార్షిక వేతనం రూ.812 కోట్లు కాగా, యాపిల్ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం రూ.1.46 కోట్లు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన సత్య నాదెళ్ల వార్షిక వేతనం రూ.451 కోట్లు కాగా, ఉద్యోగుల సగటు వార్షిక వేతనం రూ.1.29 కోట్లు.
Read Also: Pakistan: పాకిస్థాన్ లో పరువు హత్యలు.. ఇద్దరి కూతుళ్లను చంపేసిన తండ్రి
సీఈఓ జీతం ఉద్యోగి కంటే ఎక్కువ. అయితే ఇది ప్రతి కంపెనీ కథ. ఎందుకంటే కంపెనీకి కొత్త దిశానిర్దేశం చేసి దాన్ని ఒక పాయింట్‌కి తీసుకెళ్లేది సీఈవో. కంపెనీ స్టాక్ యొక్క కదలిక అతని నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. దీని కారణంగా వాటాదారుల లాభం కంపెనీ విలువ పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. కంపెనీ సీఈవో తీసుకున్న తప్పుడు నిర్ణయాల భారాన్ని కూడా కంపెనీ భరించాల్సి ఉంటుంది.