Here is Simple Steps to Indentify Duplicate iPhone Models: ప్రపంచ దేశాలతో సహా భారతదేశంలో కూడా ‘యాపిల్’ ఐఫోన్‌కు చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుత రోజుల్లో యువతతో పాటు పెద్ద వారు కూడా తమ జేబులో ఐఫోన్ ఉండాలనుకుంటున్నారు. ధర ఎక్కువగా ఉన్నా కూడా కొనేందుకు కొందరు ఆసక్తిచూపుతున్నారు. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అవనున్న నేపథ్యంలో 12, 13, 14 మోడళ్లపై ప్రస్తుతం ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో మంచి ఆఫర్స్ ఉన్నాయి. దాంతో జనాలు ఐఫోన్‌లను భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఐఫోన్‌లకు డిమాండ్ విపరీతంగా ఉంది కాబట్టి.. మోసం జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో నకిలీ ఉత్పత్తులు అమ్ముతూ.. కేటుగాళ్లు వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు.
బ్యాక్ ప్యానెల్:
మీరు కూడా ఐఫోన్‌ను కొనుగోలు చేయబోతున్నారా?, అదే సమయంలో ఫేక్ ఐఫోన్ వస్తుందని భయపడుతున్నారా?.. అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. నకిలీ ఐఫోన్‌ను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. ఒరిజినల్ ఐఫోన్ మోడల్ బ్యాక్ ప్యానెల్ గ్లాస్‌తో తయారు చేయబడుతుంది. బ్యాక్ ప్యానెల్ చూడ్డానికి, తాకడానికి చాలా సులభంగా ఉంటుంది. అదే నకిలీ ఐఫోన్ మోడల్‌లో ఇది ప్లాస్టిక్‌తో తయారు చేయబడుతుంది.
డిస్‌ప్లే:
సాధారణంగా ఐఫోన్ డిస్‌ప్లే చాలా ప్రకాశవంతంగా మరియు చాలా మృదువుగా ఉంటుంది. ఐఫోన్ డెలివరీ సమయంలో మీకు ఇవి కనిపించకపోతే.. అది నకిలీదని మీరు అర్థం చేసుకోవాలి. నకిలీ ఐఫోన్ మోడల్ ప్రదర్శన మందకొడిగా ఉంటుంది. మీరు దానిని గుర్తించగలిగేలా ఉంటుంది.
సైడ్ ప్రొఫైల్:
ఫ్రెంట్ అండ్ బ్యాక్ డిజైన్‌లో చాలా సారూప్యతలు ఉన్నా.. నకిలీ మరియు ఒరిజినల్ ఐఫోన్‌లను గుర్తించడం కష్టం. కానీ మీరు అంచులను తనిఖీ చేస్తే.. నకిలీ ఐఫోన్‌లో కొన్ని లోపాలను చూడవచ్చు. అవి ఐఫోన్ కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఐఫోన్ యొక్క ఖచ్చితమైన కాపీని తయారు చేయడం చాలా కష్టం. అంచులను బాగా పరిశీలిస్తే.. మీరు అది ఐఫోన్ నకిలీనా లేదా అని కనుగొనవచ్చు.
బరువు:
అన్నింటికంటే ముఖ్యమైంది ఐఫోన్ బరువు. ఒరిజినల్ ఐఫోన్ మోడల్ బరువు బాగా ఉంటుంది. నకిలీ ఐఫోన్ మోడల్ బరువు చాలా తక్కువగా ఉంటుంది.
కెమెరా:
ఐఫోన్ నకిలీ మోడల్‌ను గుర్తించడానికి సులభమైన మార్గం కెమెరాను చెక్ చేయడం. నకిలీ మోడల్‌లో ఒక లెన్స్ మాత్రమే పని చేస్తుంది.
రిఫ్రెష్ రేట్:
ఐఫోన్ యొక్క నకిలీ మోడల్‌లో దాదాపు 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఒరిజినల్ మోడల్ రిఫ్రెష్ రేట్ 120 Hzగా ఉంటుంది.
Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. బీసీసీఐ కీలక నిర్ణయం!