Purchase Apple iPhone 14 Plus Only RS 76999 in Amazon Apple Sale Days: ‘యాపిల్’ కంపెనీ నిత్యం కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. గతేడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేయనుంది. 2023 చివరికల్లా 15 సిరీస్ అందుబాటులోకి వస్తుంది. దాంతో ఐఫోన్ 14పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Apple Sale Days Offers:
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో ‘యాపిల్ సేల్ డేస్’ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్‌పై బంపర్ డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. ఈ సేల్ వారం రోజుల పాటు మాత్రమే కొనసాగనుంది. ఐఫోన్ 14 కొనాలనుకునే వారు 2023 జూన్ 17లోపు కొనేసుకోండి. జూన్ 17 దాటితే ఆఫర్ గడువు ముగుస్తుంది. ఇక బ్యాంక్ కార్డ్ మరియు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో పాటు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఐఫోన్ 14పై ఇవ్వబడుతుంది.
Also Read: Manipur violence: మణిపూర్ నిర్వాసితులకు 15 రోజుల్లో తాత్కాలిక గృహాలు
iPhone 14 Price Cut:
యాపిల్ గతేడాది ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రకటించింది. ఈ సిరీస్‌లో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max ఉన్నాయి. అమెజాన్‌లో ‘యాపిల్ సేల్ డేస్’ సేల్ సందర్భంగా ఈ ఫోన్‌లపై భారీ తగ్గింపును అందజేస్తున్నారు. ఐఫోన్ 14 (128GB) అసలు ధర రూ. 79,999 ఉండగా.. సేల్‌లో భాగంగా అది రూ. 67,999కి విక్రయించబడుతోంది. అంటే 15% తగ్గింపు ఉంది. 256GB వేరియంట్ ధర రూ. 89,900 కాగా.. రూ.77,999కి మీకు అందుబాటులో ఉంటుంది.
Also Read: R Ashwin: నాకు చాలా బాధ అనిపించింది.. కానీ ఏం చేయలేం..
iPhone 14 Plus Price Drop:
యాపిల్ కంపెనీ గత సంవత్సరం భారీ స్క్రీన్ మరియు బలమైన బ్యాటరీ గల ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌ను రిలీజ్ చేసింది. ఐఫోన్ 14 ప్లస్ 128GB వేరియంట్ అసలు ధర రూ. 89,900. ‘యాపిల్ సేల్ డేస్’ సందర్భంగా ఈ ఫోన్ రూ.76,999కి మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఇక 256GB వేరియంట్ 86,999 రూపాయలకు విక్రయించబడుతోంది.