Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఈ మధ్య వరుస కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. మొన్ననే ధనుష్ తో డేటింగ్ అంటూ వార్తల్లోకి ఎక్కింది. అది నిజం కాదంటూ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పాత వీడియోపై తెగ కాంట్రవర్సీ నడుస్తోంది. దానిపై తాజాగా క్షమాపణలు చెప్పింది. గతంలో బిపాసా బసు మీద చేసిన పాత వీడియో వైరల్ కావడంతో మృణాల్ పై తీవ్ర విమర్శు వస్తున్నాయి. దాంతో ఇన్ స్టాలో పోస్టు పెట్టింది మృణాల్. తాను…
Vijay Sethupathi : తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పాడు. తన కొడుకు చేసిన పనికి ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని వేడుకున్నాడు. అసలు విషయం ఏంటంటే.. సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఫీనిక్స్ సినిమాతో మొన్ననే ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ పెద్దగా కలెక్షన్లు అయితే రావట్లేదు. కాగా ఈ సినిమా ప్రీమియర్ షో లోనే తీవ్ర వివాదం నెలకొంది. ప్రీమియర్ షో, ప్రమోషన్ల…
రామ్ చరణ్ తేజ్ మీద చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో రామ్ చరణ్ అభిమానులు దిల్ రాజు సోదరుడు శిరీష్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయన ఒక లేఖ విడుదల చేసి క్షమాపణలు చెప్పారు ఇక ఇప్పుడు ఏకంగా ఒక వీడియో రికార్డ్ చేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో శిరీష్ మాట్లాడిన మాటలు యధాతధంగా మీకోసం. Also…
కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువక ముందే.. మరో బీజేపీ నేత.. ఒక ముస్లిం మహిళా ఐఏఎస్ అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
ఓ మహిళ జగన్నాథ స్వామి పచ్చబొట్టు వేయించుకోవడంపై వివాదం తలెత్తింది. ఈ విదేశీ మహిళ తన తొడపై జగన్నాథుడి బొమ్మను టాటూగా వేయించుకుంది. ఆ విదేశీ మహిళ భువనేశ్వర్‌లోని ‘రాకీ టాటూస్’ పార్లర్‌లో ఈ టాటూ వేయించుకుంది. ఇది మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఈ అంశంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. టాటూ ఆర్టిస్ట్, పార్లర్ యజమాని రాకీ రంజన్ బిషోయ్‌ను అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ మహిళ తొడపై టాటూ వేసుకోవడంతో పాటు దానికి…
CP CV Anand : హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. తన వ్యక్తిగత ఎక్స్ ఖాతా ద్వారా, “విచారణ కొనసాగుతున్న సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా రెచ్చగొట్టే ప్రశ్నలు వేయరంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. నేను చేసినది పొరపాటుగా భావిస్తున్నాను. పరిస్థితులు ఏవీ అయినా, సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. నా వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి…
హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను నటుడు మోహన్‌బాబు పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు మోహన్‌బాబు క్షమాపణ చెప్పారు. తన వల్లే తప్పిదం జరిగిందని రంజిత్ తల్లి భార్య, పిల్లలను మోహన్ బాబు క్షమాపణలు కోరారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసునని.. నువ్వు తొందరగా రికవరీ కావాలి...ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదని రంజిత్‌తో మోహన్ బాబు అన్నారు.
Sri Reddy: సినీ నటి , వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి, గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాధపడుతూ, ఇప్పుడు క్షమాపణలు కోరారు. అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత వంటి నేతలపై ఆమె సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆమె చిన్నా పెద్దా అని భేదం చేయకుండా తన అభిప్రాయాలను పంచుకుంటూ, వైసీపీకి మద్దతు తెలిపింది. అయితే, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె…