Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఈ మధ్య వరుస కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. మొన్ననే ధనుష్ తో డేటింగ్ అంటూ వార్తల్లోకి ఎక్కింది. అది నిజం కాదంటూ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పాత వీడియోపై తెగ కాంట్రవర్సీ నడుస్తోంది. దానిపై తాజాగా క్షమాపణలు చెప్పింది. గతంలో బిపాసా బసు మీద చేసిన పాత వీడియో వైరల్ కావడంతో మృణాల్ పై తీవ్ర విమర్శు వస్తున్నాయి. దాంతో ఇన్ స్టాలో పోస్టు పెట్టింది మృణాల్. తాను 19 ఏళ్ల వయసులో అలా మాట్లాడానని.. అప్పుడు తెలివి తక్కువగా మాట్లాడినట్టు ఒప్పుకుంది.
Read Also : pawan kalyan : ఇది అంతర్జాతీయ కుట్ర
అప్పుడు నాకు పెద్దగా తెలియదు. అసలైన అందం అంటే ఏంటో ఇప్పుడే నాకు తెలుస్తోంది. అది చాలా విలువైంది. మనసుతో చూసే దాంట్లోనే అందం ఉంటుంది. కంటితో కాదు. అప్పుడు తప్పుగా మాట్లాడాను అని నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. అది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు అంటూ క్షమాపణలు చెప్పింది మృణాల్. అసలు విషయం ఏంటంటే.. మృణాల్ 19 ఏళ్ల వయసులో ఓ ఇంటర్వ్యూలో బిపాసా బసుపై సెటైర్లు వేసింది. బిపాసా బసు కంటే ఆనే అందంగా ఉంటానని చెప్పింది. బిపాసా కండలు తిరిగిన మగవారిలాగా ఉంటుందని.. ఆమె కంటే తాను బెటర్ అంటూ చెప్పింది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. బాలీవుడ్ సెలబ్రిటీలు మృణాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిపాసా కూడా ఫైర్ అయింది. దెబ్బకు మృణాల్ దిగొచ్చి సారీ చెప్పింది.
Read Also : Sajjala Ramakrishna Reddy: పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదు.. జడ్పీటీసీ ఎన్నికలపై న్యాయ పోరాటం..