Mohan Babu: హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను నటుడు మోహన్‌బాబు పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు మోహన్‌బాబు క్షమాపణ చెప్పారు. తన వల్లే తప్పిదం జరిగిందని రంజిత్ తల్లి భార్య, పిల్లలను మోహన్ బాబు క్షమాపణలు కోరారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసునని.. నువ్వు తొందరగా రికవరీ కావాలి…ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదని రంజిత్‌తో మోహన్ బాబు అన్నారు. తన వల్ల జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెబుతున్నానని అని మోహన్ బాబు చెప్పారు. గాయం నుండి తొందరగా బయటపడాలని షిరిడీ సాయి నాథుని వేడుకుంటున్నానన్నారు. క్షమాపణలు తనకు కాదని జర్నలిస్టు సమాజానికి చెప్పాలని రంజిత్ మోహన్‌బాబును కోరారు. మీ దాడి లో గాయపడ్డ నాకు, మా సంస్థతో పాటు జర్నలిస్టు సమాజం అండగా నిలిచిందని రంజిత్ మోహన్ బాబుకు చెప్పారు. కాబట్టి జర్నలిస్టు సోదరులు అందరికీ మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు.
Read Also: Varun Tej Wishes Lavanya Tripathi: హ్యాపీ బర్త్‌డే బేబీ! అంటూ భార్యకు విషెస్ చెప్పిన వరుణ్ తేజ్
ఇదిలా ఉండగా.. మంచు ఫ్యామిలీలో జరిగిన వివాదం ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. మంచు ఫ్యామిలీ గొడవలను కవర్ చేసేందుకు డిసెంబర్ 10న మీడియా ప్రతినిధులు జల్‌పల్లిలోని నటుడు మోహన్‌బాబు నివాసం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు మైక్‌తో దాడి చేశారు. దీంతో జర్నలిస్ట్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. మోహన్‌బాబు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ మారగా.. జర్నలిస్టులు ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఆ ఘటనపై మోహన్‌బాబు జర్నలిస్ట్‌లకు క్షమాపణలు చెప్పారు.