CP CV Anand : హైదరాబాద్ సిటీ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. తన వ్యక్తిగత ఎక్స్ ఖాతా ద్వారా, “విచారణ కొనసాగుతున్న సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా రెచ్చగొట్టే ప్రశ్నలు వేయరంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయాను. నేను చేసినది పొరపాటుగా భావిస్తున్నాను. పరిస్థితులు ఏవీ అయినా, సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. నా వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుతున్నాను” అంటూ పోస్ట్ చేశారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఖలిస్థానీ టెర్రరిస్టులు హతం
నిన్న జరిపిన ప్రెస్ మీట్లో, సీవీ ఆనంద్ సంధ్య థియేటర్ ఘటనపై వివరణ ఇచ్చి, ఆ సంఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఈ క్రమంలో మీడియా ఆయనను కొన్ని ప్రశ్నలతో ప్రశ్నించగా, “అల్లు అర్జున్ వ్యవహారంలో నేషనల్ మీడియా అమ్ముడుపోయిందని” అన్న వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వాగ్విద్వేషాన్ని రేపడంతో, ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరారు.
Uppal Fly Over: ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పునఃప్రారంభం