ఓ మహిళ జగన్నాథ స్వామి పచ్చబొట్టు వేయించుకోవడంపై వివాదం తలెత్తింది. ఈ విదేశీ మహిళ తన తొడపై జగన్నాథుడి బొమ్మను టాటూగా వేయించుకుంది. ఆ విదేశీ మహిళ భువనేశ్వర్‌లోని ‘రాకీ టాటూస్’ పార్లర్‌లో ఈ టాటూ వేయించుకుంది. ఇది మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఈ అంశంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. టాటూ ఆర్టిస్ట్, పార్లర్ యజమాని రాకీ రంజన్ బిషోయ్‌ను అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ మహిళ తొడపై టాటూ వేసుకోవడంతో పాటు దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, భువనేశ్వర్‌లోని మత సంస్థలు సాహిద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పార్లర్ యజమానిపై ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు BNS సెక్షన్ 299, 196, 3(5) కింద కేసు నమోదు చేసి, రాకీ బిషోయ్‌ను అరెస్టు చేశారు.
READ MORE: Apple Launches iPad: భారత్‌లో సరికొత్త చిప్‌లతో ఐప్యాడ్‌లను విడుదల చేసిన యాపిల్
ప్రజల ఆగ్రహాన్ని చూసి పార్లర్ యజమాని రాకీ బిషోయ్, విదేశీ మహిళ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. రాకీ బిషోయ్ క్షమాపణలు చెబుతూ ఇలా అన్నాడు: “మా స్టూడియోలో ఈ టాటూ వేయించుకున్నందుకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఆ మహిళ ఇటాలియన్ పౌరురాలు. జగన్నాథ స్వామి భక్తురాలు. ఆమె తన కోరిక మేరకే ఈ టాటూ వేయించుకుంది. పచ్చబొట్లు అనుమతించని ఎన్‌జీవోలో ఆమె పని చేస్తుంది. అందుకే వారికి కనిపించకుండా తన తొడపై పచ్చబొట్టు వేయించుకుంది. నేను ఆమెకు ఆ పచ్చబొట్టు తొలగించమని లేదా ఆ స్థలంలో మరొక పచ్చబొట్టుతో కవర్ చేయమని సూచించాను. ఇప్పుడే తొలగిస్తే.. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున, ఆమె 25 రోజుల తర్వాత దాన్ని తొలగిస్తానని చెప్పింది.” అని పేర్కొన్నాడు.
READ MORE: Nara Lokesh: చట్టాన్ని ఉల్లంఘించి జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా..?
ఆ విదేశీ మహిళ కూడా క్షమాపణలు చెప్పింది. “ఇలా టాటూ వేసుకోవడం వల్ల ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తాయని నాకు తెలియదు. నేను జగన్నాథుని భక్తురాలిని. ఈ టాటూ వేసుకోవడం నా తప్పు. నేను తీవ్రంగా చింతిస్తున్నాను. త్వరలో దాన్ని తొగిస్తాను. దయచేసి నన్ను క్షమించండి.” అని పేర్కొంది.
: