దేశాన్ని, పార్లమెంటును అప్రతిష్టపాలు చేసినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధవారం పార్లమెంటులో అన్నారు. ఈ విషయం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగానికి సంబంధించినది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస వివాదాలపాలవుతున్నాడు. మొన్నటికి మొన్న నడిరోడ్డుపై ఫ్రాంక్ వీడియో చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురికావడమే కాకుండా న్యూసెన్స్ కేసు నమోదు అయ్యేలా చేసుకున్నాడు. ఇక నిన్నటికి నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూకు వెళ్లి యాంకర్ పై అసభ్య పదజాలంతో నోరుపారేసుకొని వార్తల్లో నిలిచాడు. ఇదంతా ఎందుకు అంటే నా సినిమా ప్రజలలోకి వెళ్ళడానికి ఏదైనా చేస్తా అని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.…
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ రాజకీయాల గురించి తప్ప మిగతా విషయాల గురించి అంతగా మాట్లాడరు. కానీ సినిమా తారల గురించి ప్రస్తావిస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రం కాదు అని భిక్ష అని కంగనా పేర్కొనడంపై తీవ్రంగా…