ఉద్యోగులకు చెందిన వివిధ పెండింగ్ సమస్యలపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ భేటీ అయ్యారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉద్యోగుల బదిలీ పాలసీపై చర్చ జరిపారు. సీపీఎస్ రద్దు సాధ్య సాధ్యాలపై సమీక్ష చేసారు. సీపీఎస్ రద్దుని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఆందోళనలకు ఉద్యోగులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారనే అంశం భేటీలో ప్రస్తావన వచ్చింది. త్వరలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలనే ప్రతిపాదన పెట్టారు. కరోనా సమయంలో భారీ బదిలీలు సరి కాదని అభిప్రాయపడ్డ పలువురు అధికారులు… వివిధ కారణాలతో ప్రభుత్వానికి వచ్చిన రిక్వేస్ట్ ట్రాన్ఫర్స్ మాత్రమే చేసే అంశాన్ని సమావేశంలో పరిశీలించారు.