బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణను మీడియా ముందు హజరుపరచారు పోలీసులు. అనంతరం ఐజీ రాజశేఖర్ మాట్లాడుతూ… నల్లపు రమ్య, కుంచాల శశికృష్ణకి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ పరిచయం పెరిగింది.. ఆ తరువాత నుండి ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ వేదిస్తున్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ శభాష్ అనిపించేలా రాష్ట్రంలో మహిళల రక్షణ కల్పించడం జరుగుతుంది. ఈ టైంలో ఇలాంటి ఘటన దురదృష్టకరం అన్నారు. మహిళలు సోషల్ మీడియా ట్రాప్ లో పడకుండా జాగ్రత్త పడాలి అని సూచించారు. రమ్యపై దాడి జరుగుతుంటే పక్కన ఉన్నవాళ్లు చూస్తూ ఉండిపోయారు. అర్బన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసే టైంలో సైతం అతని సైకోలాగా బ్లేడ్ తో కోసుకోవడం జరిగింది అని పేర్కొన్నారు.