ఒక్కొ ఇంటికి 1.80 లక్షల రూపాయలు కేటాయించినట్లు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. నిర్ధేశించిన మొత్తంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. మహిళలకు ఇళ్లు కాదు.. ఆస్తి ఇస్తున్నాం అన్నారు. ఏపీ వ్యాప్తంగా 9 లక్షల ఇళ్ళు గ్రౌండ్ అయ్యాయి. లేఔట్ల వద్దే లబ్ధిదారులకు ఇసుక, స్టీల్, సిమెంట్ సరఫరా చేస్తాం. పేదల ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పదేపదే అడ్డుపడుతున్నారు. వచ్చే రెండేళ్లలో జగనన్న కాలనీలు పూర్తి చేస్తాం. జగన్ సర్కార్ కు…
మంత్రి మేకపాటి అధ్యక్షతన పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు చేయనున్నారు. అయితే త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 వస్తుంది అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అయితే లాజిస్టిక్ పాలసీ -2021 పై కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్… మౌలిక సదుపాయలకు పెద్దపీట వేస్తుంది ఏపీ. కేంద్రస్థాయిలో అథారిటీ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే రాష్ట్రానికి…
ఢిల్లీ : బుగ్గన రాజేంద్ర నాథ్ ఆర్థిక మంత్రిగా కన్నా అప్పుల మంత్రిగా బాగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు జివిఎల్ నరసింహారావు. ఏపీ అప్పుల ఆంద్రప్రదేశ్ గా మారిందని దేశం మొత్తానికి తెలిసిందని…కొత్త అప్పుల కోసం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు జివిఎల్ నరసింహారావు. ఓటు బ్యాంకు కోసం, పథకాల కోసం రుణాలు చేస్తున్నారని… ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శలు చేశారు. పెన్షన్లు..జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని.. అప్పుల పై చూపించే…
గోదావరి జిల్లా వాసులు సంతోషం వస్తే పట్టలేరు. తేడా వచ్చిందో గోదారి యాసలోనే ఏకి పడేస్తారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు రెండో కేటగిరీలోకి చేరారట. ఎమ్మెల్యేగా అందరివాడుగా ఉన్న ఆయన మంత్రి అయ్యాక కొందరివాడుగా మారారని ఒకటే కామెంట్స్. ఎమ్మెల్యే అంటే ఆయనలా ఉండాలన్న వారు.. ఇప్పుడు మాకొద్దు బాబోయ్ అని దూరం జరుగుతున్నారట. ఎందుకలా? ఆయనలో వచ్చిన మార్పులేంటి? ఎవరా మంత్రి? లెట్స్ వాచ్! ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్మార్నింగ్ అని పర్యటించేవారు!…
నగర స్థాయి నేతగా ఉన్న ఆయన… నామినేటెడ్ పదవి రావటంతో ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చేసింది. ఆయన రాజకీయ అరంగ్రేటం ఒకవర్గం నుంచి జరగ్గా.. ప్రస్తుతం ఆయన కలిసి పనిచేయాల్సిన నేత ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు. అదే ఆయనకు తలనొప్పిగా మారిందట. ఆ నేత కలిసి పనిచేస్తున్పప్పటికీ ఆయన సామాజికవర్గంలోని కొందరు మాత్రం లోలోపల గొణుక్కుంటున్నారట. మరికొందరైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తున్నారట. దీంతో కొత్త పదవి కత్తి మీద సాములా మారిందట. ఆయనెవరో…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. అలాగే పైన జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 3,78,311 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 31,784 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 860.30 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 106.9352 టీఎంసీలు ఉంది.…
అమరావతి : ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగించాలని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న 719 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ వారి సేవలను పొడిగిస్తున్నట్టు పేర్కొంది ఏపీ ప్రభుత్వం. జూన్ 2021 నుంచి ఓ పది రోజుల…
ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మే 5 న నిర్వహించాల్సిన పరీక్షలను సుప్రీం కోర్టు ఆదేశాలతో థియరీ పరీక్షలను రద్దు చేశామని అన్నారు. విద్యార్థులు అందరినీ ఉత్తీర్ణులను చేశామని… సుప్రీం కోర్టు జులై 31 లోపు ఫలితాలు ప్రకటించాలని ఆదేశించిందని తెలిపారు. కానీ గడువుకు వారం ముందే ఫలితాలు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. మార్కుల విధానం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని…
ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ కు పులిచింతల ప్రాజెక్ట్, మున్నేరు, పాలేరు, కట్లేరు ప్రాంతాల నుంచి ఈరోజు సాయంత్రానికి సుమారు లక్ష క్యూసెక్స్ వరకు వరద నీరు చేరనుంది. వరద ఉధృతి పై అధికారులను మరింత అప్రమత్తం చేసారు కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్. అయితే ప్రస్తుతo ఇన్ ఫ్లో 33,061 అవుట్ ఫ్లో 31,500 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 87,521 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 847.60 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 74.9770 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్…