Piyush Goyal: “టెన్షన్ వద్దు గురూ”.. ఇంధన సరఫరాపై కేంద్రం పక్కా ప్లాన్ రెడీ.. కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piyush Goyal: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రపంచం ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి నెలకొంది. భారత్‌లోనూ ఇంధన కొరత ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సామాన్యూలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సామాన్యులకు భారోసా ఇచ్చారు. తమిళనాడలోని తిరుచిరాపల్లిలో కేంద్ర మంత్రి మంగళవారం మాట్లాడారు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ మిడిల్ ఈస్ట్ పరిస్థితిని నిరంతరం గమనిస్తోందని.. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఇంధన సరఫరా గొలుసుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆయా శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాలేదన్నారు. క్షేత్రస్థాయిలోనూ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అవసర వస్తువుల చట్టాన్ని’ (Essential Commodities Act) ప్రయోగించిందని చెప్పారు.
READ MORE: Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్‌సింగ్‌కు భారీ ఓపెనింగ్స్ వుండవా?
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ఇక.. పెట్రోలియం శాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లు తమ వద్ద ఉన్న హైడ్రోకార్బన్ నిల్వలను ఎల్‌పీజీ (LPG) తయారీకి మళ్లించాలని సూచించింది. దీనివల్ల వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సామాన్యూలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర చర్యలు తీసుకుంటోంది. గృహ అవసరాలకు వాడే వంట గ్యాస్, వాహనాలకు వాడే సీఎన్‌జీ (CNG) సరఫరాలో 100 శాతం కోత లేకుండా అందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. దీనికి కావాల్సిన అన్ని చర్యలను చేపడుతోంది. మిగిలిన రంగాలకు సంబంధించి గత ఆరు నెలల సగటు వినియోగాన్ని బట్టి సరఫరాలో కొంత మార్పులు చేశారు. టీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర తయారీ రంగాలకు 80 శాతం మేర గ్యాస్ సరఫరా కానుంది. అలాగే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు కూడా 80 శాతం సరఫరాను పరిమితం చేశారు. వ్యవసాయానికి సంబంధించి కూలా ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూస్తోంది. ఇప్పటికే ఎరువుల తయారీకి కావాల్సిన గ్యాస్‌ను ఎరువుల కర్మాగారాలకు 70 శాతం కేటాయింపులు జరిగాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న రవాణా సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను సైతం అన్వేషిస్తోంది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!