పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఫ్యాక్టరీ తరలింపు నిర్ణయాలు ఉండచ్చు. చిత్తూరు జిల్లాకు సేవ చేయాలని అనుకున్న దానికంటే ఎక్కువే చేశాను అని అమరరాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు అన్నారు. హైకోర్టులో ఉన్న కేసులపై మాట్లాడటం కరెక్ట్ కాదు. 36 ఏళ్ళుగా ఎంతో నిబద్ధతతో కంపెనీ అభివృద్ధి చేశాము. వేలాదిమందికి ఉద్యోగం అవకాశాలు కల్పించాము. నేను రాజకీయ నాయకుడ్ని కాదు… నేను వ్యాపార వేత్తను… సమాజసేవ కుడిని మాత్రమే అని తెలిపారు. ఇక గల్లా జయదేవ్…
వివిధ శాఖల సెక్రటరీలతో ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ భేటీ అయ్యారు. ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర పథకాల అమలు.. కేంద్ర నిధుల వినియోగంపై చర్చించారు. సచివాలయంలో ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల హాజరుపై సీఎస్ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. సెక్రటేరీయేట్టుకు ఉన్నతాధికారులు రాకుంటే పరిపాలన గాడి తప్పుతుందని అభిప్రాయపడ్డ సీఎస్… ఉద్యోగులు క్రమశిక్షణతో ఉండాలంటే ఉన్నతాధికారులు సచివాలయానికి రావాలన్నారు. హెచ్‌వోడీ, క్యాంప్ ఆఫీసుల నుంచి పని చేసే విధానానికి సెక్రటరీలు స్వస్తి పలకాలని ఆదేశించారు.…
17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చలనాల కుంభకోణం జరిగిందని గుర్తించాం అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ శేషగిరిబాబు అన్నారు. రూ. 5 కోట్ల మేర నిధులు పక్క దారి పట్టినట్టు గుర్తించాం. రూ. కోటి రికవరీ చేశాం అని తెలిపారు. బోగస్ చలనాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తుల విషయంలో ఏం చేయాలనే అంశంపై న్యాయ సలహాలు తీసుకుంటున్నాం. ఆస్తులని రిజిస్ట్రేషన్ చేసినట్టు ప్రస్తుతం రికార్డుల్లో ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్ వేర్ అందుబాటులోకి…
బోగస్ చలనాల కుంభకోణంపై సీఎం జగన్ ఆరా తీశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. ఇప్పటికే రూ. 40 లక్షల మేర సొమ్మును రికవరీ చేసినట్టు వెల్లడించిన అధికారులు… సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్ వేర్ ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్ లకు అనుసంధానం చేయడం ద్వారా అవకతవకలకు చెక్ చెప్పొచ్చని సీఎంకు వివరించారు…
నకిలీ చలాన్లతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఘటనలు కలకలం సృష్టించాయి. కడప సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసిన తర్వాత రాష్ట్రంలో అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో 2018నుంచి ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేసిన చలాన్లపై పరిశీలన చేపట్టారు. గుంటూరు జిల్లాలో 35 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ శ్రీనివాసరావు ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. మంగళగిరి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్లతో మోసం…
విజయవాడ ఏ.ఆర్ కానిస్టేబుల్ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఐస్‌క్రీమ్ బండి యజమానిని హతమార్చాడు. ఐస్‌క్రీమ్ బండి యజమాని వెంకటేష్ ….తన ఇంట్లోకి చొరబడినట్లు సమాచారం అందుకున్న కానిస్టేబుల్ డ్యూటీలో నుంచి వెంటనే ఇంటికి చేరుకున్నాడు. వెంకటేష్‌ని పట్టుకుని తీవ్రంగా గాయపరిచారు ఏఆర్ కానిస్టేబుల్. ఈ దాడిలో వెంకటేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు వెంకటేష్. దాంతో అతని…
డీఆర్ సీసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది నీటికేటాయింపులపై త్వరలో సమావేశం ఏర్పాటు అవుతుంది అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. భీమా విషయంలో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాలో 429 లేఅవుట్ లలో ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. 229 లేవుట్ లలో పనులు ప్రారంభించాం. ఇసుక అందరికి అందుబాటులోకి తెస్తున్నాం.172 ప్రాంతాల లో ఇసుక రీచ్ లను గుర్తించాం. ట్రాక్టర్, బండ్లతో ఉచితంగా ఇసుక…
సీమలో తిరిగి పట్టుసాధించే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తోందా? రాయలసీమ హక్కుల సాధన ఉద్యమాన్ని తలకెత్తుకుందా? కర్నూలు కేంద్రంగా కృష్ణా జలాలపై తెలుగుదేశం తలపెట్టిన ఆందోళన దేనికి సంకేతం? లెట్స్ వాచ్! రాయలసీమ హక్కుల సాధన పేరుతో టీడీపీ పోరు! సాగునీటి ప్రాజెక్టులు.. కృష్ణా, తుంగభద్ర జలాల అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ.. రాయలసీమ హక్కుల సాధనకు ఉద్యమాన్ని ప్రారంభించింది టీడీపీ. సీమ వెనకబాటుతనం.. నిర్మాణంతోపాటు ప్రతిపాదనల్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది. నీటి…
వైసీపీ కాంగ్రెస్ ఎంపీల బృందం కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజును కలిశారు. ఈ ఎంపీల బృందం లో విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. అనర్హత పిటిషన్ల పై నిర్ణీత గడువు లోపల నిర్ణయం తీసుకోవాలి. పదో షెడ్యూల్ ను ఈ మేరకు సవరించాలని వినతి. ఏపీ హైకోర్టు ను కర్నూలు కు తరలించాలి. కర్నూల్లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని…