కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో వ్యర్ధాల మేనేజమెంట్ పై దేశ వ్యాప్తంగా సర్వే చేసింది. దేశంలోనే అన్ని నగరాల్లో స్వచ్ఛ భారత్ కింద వ్యర్ధాల మేనేజ్మెంట్ లో సర్వే చేశారు. 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే రాష్ట్రం నుండి 3 నగరాలు ఎంపిక అయ్యాయి అని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నంలు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కు ఎంపికయ్యాయి. అన్ని పట్టణాలను ఇలానే తయారు చేయాలని సీఎం ఆదేశించారు. టీడ్కో ఇళ్లను 6 నెలల్లో 80 వేలు..మరో 6 నెలల్లో మరో 80 వేలు…మిగిలినవి తర్వాత 6 నెలల్లో ఇస్తాం అని తెలిపారు. మొత్తం 2.60 లక్షలు టీడ్కో ఇల్లు ఉన్నాయి…అన్ని త్వరగా ఇచ్చేస్తాం అన్నారు.
ఇక ఇంటి నిర్మాణానికి డబ్బు సరిపోవడం లేదు అంటే ఇంతకు ముందు ఎంత ఇచ్చారో గుర్తు చేసుకోవాలి. విస్తీర్ణం, డబ్బు కూడా ఇప్పుడు ఎక్కువగా ఇస్తున్నాం. లోకేష్ వి అవగాహన లేని మాటలు. చేయూత, నేతన్న నేస్తం వంటి పథకాల వల్ల బీసీలకు న్యాయం జరుగుతుంది. వారి జీవన విధానం మారడానికి ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నాం. రాజధాని కేసులను రోజు వారీ విచారణ చేస్తాం అన్నారు కదా అని ప్రశ్నించారు. పిటిషనర్ లు మూడు నెలలు వాయిదా అడగడం వెనుక ఏం ఉద్దేశ్యాలు ఉన్నాయి. వాళ్లే కదా కేసు వేసింది..ఎందుకు వాయిదా అడిగారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలనే విధానానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎవరెన్ని చెప్పినా వెళ్లడం ఖాయం…న్యాయస్థానాన్ని ఒప్పిస్తాం.. న్యాయస్థానం ఆదేశాల మేరకే వెళతాం అని పేర్కొన్నారు.