ఆంధ్రప్రదేశ్లో కరోనా కొత్త కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71,030 శాంపిల్స్ పరీక్షించగా.. 1,869 మంది పాజిటివ్గా తేలింది… మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,316 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,87,051కు చేరుకోగా.. రికవరీ కేసులు 19,55,052కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు…
పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మింది ఆ మహిళ. భర్త మరణానంతరం కూడా పూజిస్తూ.. ఆయన సేవకే అంకితమైంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతికి 21 సంవత్సరాల క్రితం వివాహమైంది. దురదృష్టవశాత్తు నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అంకిరెడ్డి. తన భర్త మరణానంతరం ఆయనకు ఏకంగా గుడి కట్టి.. నిత్యం పూజలు చేస్తుంది అతని భార్య. అంతేకాదు ప్రతి పౌర్ణమి, శని, ఆదివారాలలో పేదలకు అన్నదానం కూడా…
ఆపరేషన్ కాకినాడలో వైసీపీ వేగంగా పావులు కదుపుతోందా? రాజకీయ ఎత్తుగడలు.. వ్యూహాలు ఆసక్తిగా మారుతున్నాయా? త్వరలోనే టీడీపీకి మరో షాక్ ఇవ్వనుందా? కాకినాడలో కాకమీద ఉన్న రాజకీయాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్! కాకినాడ మేయర్ పీఠంపై వైసీపీ గురి! తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారపార్టీ వైసీపీ పూర్తిగా పట్టు సాధించింది. ఇటీవల జరిగిన రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీకి ఝలక్ ఇచ్చారు ఆ పార్టీ కార్పొరేటర్లు. 16 మంది టీడీపీ రెబల్…
దళితుల గురించి చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. దళితుల గురించే మాట్లాడే నైతికత, అర్హత చంద్రబాబుకు లేదు. దళితులను అవమానించినందుకు అంబేద్కర్ విగ్రహం ముందు చంద్రబాబు ముక్కు నేలకు రాయాలి అని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళితులపై దాడులు ఆరోపణలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. బలంగా ఉన్న దళితులను విభజించి పాలించాలనేది చంద్రబాబు నైజం. దళితులను వాడుకుని వదిలేయడమే చంద్రబాబు పని. రాజధానిలో దళితులకు ఇళ్లపట్టాలు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు…
అధికారంలో లేకపోయినా సరే అస్సలు తగ్గట్లేదు. అదే పంతాలు.. అవే పట్టింపులు. ప్రస్తుతం ఆ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతల తీరు అలాగే ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఇప్పుడేంటో కూడా తెలియదు. అయినప్పటికీ అక్కడి నేతలు తాము చెప్పిన వారికే పదవులు ఇవ్వాలని పంతం పడుతున్నారట. ఫలితంగా పార్లమెంట్ కమిటీ ఎంపికను అధిష్ఠానం ఎటూ తేల్చలేదు. ఈసారి మాత్రం సరికొత్త వ్యూహాం రచిస్తోందట. అదేంటో ఇప్పుడు చూద్దాం. అనంతపురంలో పార్టీ కమిటీ ఏర్పాటులో టీడీపీ…
మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఈ మాటేమోకానీ అక్కడ మాత్రం పిడికెడు ఇసుక.. బారెడు చర్చకు దారితీస్తోంది. ఇద్దరు అధికారుల మధ్య పంచాయితీని పతాకస్థాయికి తీసుకెళ్లిన ఆ ఇసుక చుట్టూనే అనేక కథలు పుట్టుకొస్తున్నాయి. ఉన్న రాజకీయాలతో ఉద్యోగులు నలిగిపోతున్న సమయంలో.. రామాయణంలో పిడకల వేటలా జరుగుతోన్న ఆ చర్చేంటో ఈస్టోరీలో చూద్దాం. ఉన్నతాధికారుల దగ్గర వాదన వినిపించేందుకు డీసీ, ఏసీ సిద్ధం! విశాఖ జిల్లా దేవాదాయశాఖ అధికారుల మధ్య పంచాయితీ అమరావతికి చేరింది. అంతర్గత విభేదాల కారణంగా…
ఈ నెల 16వ తేదీ నుంచి ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ చేస్తున్నాం అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెగ్యులర్ టైమింగ్సులోనే స్కూళ్లను రన్ చేస్తాం అని అన్నారు. ఇక కోవిడ్ ప్రొటోకాల్ పాటించేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తైంది. వ్యాక్సిన్ వేయించుకోని మిగిలిన టీచర్లకు కూడా టీకాలు వేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించాం. ఆన్ లైన్ తరగతులు రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదు అని పేర్కొన్నారు.…
వైయస్సార్ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన నేతన్నలకు ఆర్థిక సహాయం కార్యక్రమం ప్రారంభించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దాదాపుగా 80 వేల మంది చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది: రూ.192 కోట్లు జమచేస్తున్నాం. నేతన్నలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు నా పాదయాత్రలో స్వయంగా చూశాను. ప్రతి జిల్లాలో చేనేతల సమస్యలు నాకు చెప్పకున్నారు అని సీఎం అన్నారు. వారి గోడును బహుశా నేనెప్పటికీ మరిచిపోలేను. మగ్గంమీద బతుకుతున్న చేనేత కుటుంబానికి అక్షరాల రూ.24వేల…
ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి. కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కలిగిస్తోంది. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. లోకేష్ మంగళగిరిలో ఓడిన తర్వాత అయినా వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని…