తిరుపతి బీజేపీ నేతలది వన్ మ్యాన్ షో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలిసి పనిచేస్తేనే పార్టీ అయినా.. మరేదైనా సక్సెస్ అవుతుంది. కానీ.. అక్కడ ఆ నేతలు ఎక్కువగా వన్ మ్యాన్ షో చేస్తుంటారు. ఎవరికి వారే మైలేజ్ కోసం ప్రయత్నిస్తూనే ఇంకొకరికి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తారు. ఎవరు చెప్పినా.. ఎంత చెప్పినా మారని ఆ నేతలతో ఆ పార్టీ కూడా ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది.
వర్గాలుగా విడిపోయిన తిరుపతి బీజేపీ.. ఎవరి శిబిరం వారిదే!
Also Read
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
ఆధ్యాత్మిక నగరం తిరుపతి కేంద్రంగా బీజేపీ కార్యకలాపాలు చురుగ్గా సాగుతుంటాయి. తిరుమల, తిరుపతి ఆథ్యాత్మిక కేంద్రంగా ఉండటంతో.. కొండపైన, కింద కాషాయదళం నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. అయితే ఎన్నేళ్లు గడుస్తున్నా తిరుపతి బీజేపీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదంటోంది కేడర్. దీనికంతటికీ కారణం.. కేడర్ కంటే నాయకులే ఎక్కువని వైరిపక్షాలు అప్పుడప్పుడూ సెటైర్లు వేస్తుంటాయి కూడా. జిల్లాలో శాంతా రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్ సహా కొందరే సీనియర్లు బీజేపీలో ఉన్నారు. నిరసనలకు వచ్చేసరికి భానుప్రకాష్‌రెడ్డి,శ్రీనివాస్‌లే కనిపిస్తుంటారు. విషయం ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై రాష్ట్రంలో వారే స్పందిస్తుంటారు. గతంలో శాంతారెడ్డి హవా సాగినా.. తర్వాతి తరం వచ్చాక ఆ దూకుడు లేదట. పైగా బీజేపీలో భాను ఓ వర్గంగా, శాంతారెడ్డి మరో వర్గంగా.. జల్లి మధుసూదన్ ఇంకోవర్గంగా ఉంటున్నారట. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిన వేర్వేరుగా ధర్నాలు చేస్తుంటారు. కేడర్ కూడా తమకు నచ్చిన నేత వెంట వెళ్లిపోతోందట.
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లోనూ ఎవరికి వారే యమునా తీరే!
ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల సమయంలో తిరుపతి బీజేపీ నేతలను ఒక్కతాటిపైకి తేవాలని పార్టీ పెద్దలు ప్రయత్నించారట. వారి ముందు ఓకే అని చెప్పినప్పటికీ.. తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించారట. ఉపఎన్నికలో ఓటమి తర్వాత ఈ విభేదాలు ఇంకా పెరిగినట్టు చెబుతున్నారు. గత ఏడాది శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి సీఎం జగన్ తిరుపతి వస్తున్న సందర్భంలో.. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భానుప్రకాష్‌రెడ్డి నిరసన తెలిపారు. ఒకవైపు భాను ఆందోళన చేస్తుంటే..బీజేపీ ఎలాంటి నిరసనలకు పిలుపివ్వలేదని పార్టీ నేత దయాకర్‌రెడ్డి ప్రకటన విడుదల చేయడం అప్పట్లో చర్చగా మారింది.
కిషన్‌రెడ్డి ఆశీర్వాదయాత్రకు కొందరు డుమ్మా?
తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తిరుపతిలో నిర్వహించిన ఆశీర్వాద్ యాత్రలోను నగర బీజేపీ నేతలు అంటీముట్టనట్టుగా ఉన్నారట. కొంతమంది నాయకులు ఆశీర్వాద యాత్రకు డుమ్మా కొట్టేశారట. ఉపఎన్నిక సమయంలో నేతల మధ్య పెరిగిన విభేదాలు ప్రస్తుతం తారాస్ధాయికి చేరాయి. ఇంత చేస్తే.. పార్టీ ఏమైనా పెరిగిందా అంటే అదీ లేదు. ఎన్నేళ్లు అయినా ఎన్ని ఎన్నికలు వచ్చినా అవే ఓట్లు అదే సీన్. అటు పార్టీ పెరగదు. ఇటు వర్గ విభేదాలు తరగవు అన్నట్టు తిరుపతి బీజేపీ పరిస్థితి ఉంది. మరి.. తిరుపతి బీజేపీని గాడిలో పెట్టేందుకు పెద్ద కమలనాథులు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!