బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణను మీడియా ముందు హజరుపరచారు పోలీసులు. అనంతరం ఐజీ రాజశేఖర్ మాట్లాడుతూ… నల్లపు రమ్య, కుంచాల శశికృష్ణకి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ పరిచయం పెరిగింది.. ఆ తరువాత నుండి ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ వేదిస్తున్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ శభాష్ అనిపించేలా రాష్ట్రంలో మహిళల రక్షణ కల్పించడం జరుగుతుంది. ఈ టైంలో ఇలాంటి ఘటన దురదృష్టకరం అన్నారు. మహిళలు సోషల్ మీడియా ట్రాప్ లో పడకుండా జాగ్రత్త…
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో విచారణ జరిపారు. తెలంగాణ సమర్పించిన ఫోటోలను ఎన్జీటీ పరిశీలన చేసింది. కోర్టు ధిక్కరణకు ఏపీ పాల్పడినట్లు అర్థం అవుతోంది’’ అని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. ధిక్కరణ కేసులో గతంలో అధికారులను జైలుకు పంపారా అని ప్రశ్నిచింది. అధికారులను ఎన్జీటీ నేరుగా జైలుకు పంపవచ్చా? లేక హైకోర్టు ద్వారా అధికారులను జైలుకు పంపాలా అని పిటిషనర్ల అభిప్రాయాన్ని కోరింది ఎన్జీటీ. అధికారులను శిక్షించిన సందర్భాలు ఎదురుకాలేదన్న ఎన్జీటీ… పర్యావరణ శాఖతో ఏపీ…
దేవాదాయశాఖ పేరు వింటేనే పవిత్రభావం కలగాలి. కానీ.. అక్కడ జరగని అరాచకం లేదు. అలా జరగకుండా చూడాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. మహాఅయితే తూతూ మంత్రంగా మమ అనిపించేస్తున్నారు. క్రమశిక్షణ ఉండాల్సిన శాఖ కట్టుతప్పడానికి రాజకీయ అండదండలేనట. వివాదాస్పదంగా మారిన వారిపై చర్యలు తీసుకోవడానికి పైవాళ్లు జడిసే స్థాయిలో నేతల మద్దతును వీళ్లు కూడగట్టారట. దేవాదాయశాఖలో తప్పు జరిగితే చర్యలు ఉండవ్! ఏపీ దేవాదాయశాఖ గాడి తప్పిందా? ఏదో ఒక గొడవ లేదా ఇంకేదో వివాదం..…
అంగన్వాడీ పాల అక్రమరవాణా కేసులో 26 మంది అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. గతనెల 3వ తేదీన శ్రీకాకుళం భామిని మండలం బత్తిలిలో 1919 లీటర్ల పాల ప్యాకెట్లు పట్టుబడ్డాయి. పాలు అక్రమ రవాణా చేస్తున్న వాహనం సీజ్ చేసి , ఐదుగురిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ పాల అక్రమరవాణా కేసులో 40 రోజుల పాటు పోలీసులు దర్యాప్తు కొనసాగించగా విచారణలో వీరఘట్టం, వంగర మండలాలకు చెందిన 28 మంది అంగన్వాడీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు…
అసలే నియోజకవర్గాలలో అంతంత మాత్రంగా ఉంది పార్టీ పరిస్థితి. మెరుగు పరుచుకోవడానికి అవకాశం వచ్చినా ఆ ముగ్గురు సద్వినియోగం చేసుకోలేదట. అందుకే కేడర్ వారిపై గుర్రుగా ఉంది. మళ్లీ చూద్దామన్న నేతల మాటలను జీర్ణించుకోలేకపోతున్నారట. లాభం లేదని అధినేతకు ఫిర్యాదులు చేశారట తమ్ముళ్లు. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం. సోషల్ మీడియాలో ఇంఛార్జ్‌లపై తమ్ముళ్లు ఫైర్! చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, శ్రీకాళహస్తీ, తిరుపతి నియోజకవర్గాల ఇంఛార్జులు ఒక్కసారిగా పార్టీ వర్గాల్లో చర్చగా మారారు. చంద్రగిరి ఇంఛార్జ్…
అక్కడ రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన నేత ఉన్నారు. కానీ.. ఆయనతో వర్కవుట్ కాదని కేడర్ అంటోందట. మళ్లీ గెలవాలంటే.. నేతను మార్చాల్సిందే అంటున్నారట. కొత్త నేత ఎవరో కూడా కేడర్ డిసైడ్ చేసిందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ? కేడర్ వద్దనుకుంటున్న ఆ నాయకుడు ఎవరు? కొత్త నేతను సెట్ చేసుకుంటోన్న టీడీపీ కేడర్? గుంటూరు జిల్లా వినుకొండ. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట. వరసగా రికార్డు మెజారిటీతో గెలిచిన జీవీ…
ఉద్యోగులకు చెందిన వివిధ పెండింగ్ సమస్యలపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ భేటీ అయ్యారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉద్యోగుల బదిలీ పాలసీపై చర్చ జరిపారు. సీపీఎస్ రద్దు సాధ్య సాధ్యాలపై సమీక్ష చేసారు. సీపీఎస్ రద్దుని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఆందోళనలకు ఉద్యోగులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారనే అంశం భేటీలో ప్రస్తావన వచ్చింది. త్వరలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలనే ప్రతిపాదన…
ఆయనేమో అనువంశిక ధర్మకర్త. వాళ్లేమో అధికారులు. ఈ రెండు వ్యవస్థల మధ్య అనూహ్యమైన గ్యాప్ వచ్చింది. కారణాలేవైనా చైర్మన్‌కు ఎదురుపడేందుకే ఈవోలు సాహసించడం లేదు. దీంతో ధర్మకర్త దండం పుచ్చుకొనేందుకు సిద్ధమయ్యారట. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారు? అశోక్‌తో మాట్లాడేందుకు ఈవోలు విముఖం! సింహాచలం దేవస్థానం ఛైర్మన్ పదవి చుట్టూ పెద్ద ధారావాహికమే నడుస్తోంది. ధర్మకర్త పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పించిన ప్రభుత్వం.. ఆ ప్లేస్‌లో సంచయితను తెచ్చి పెట్టింది. ఆమె నియామకాన్ని సవాల్ చేసి..…
వారిద్దరూ మాజీ ప్రజాప్రతినిధులు. ఒకరు మాజీ ఎమ్మెల్యే.. ఇంకొకరు మాజీ ఎమ్మెల్సీ. ఒకే పార్టీ. ఒకే నియోజకవర్గం. నిన్న మొన్నటి వరకు కలిసే ఉన్నా.. ఇగో క్లాష్‌తో గ్యాప్ వచ్చింది. ఒక్కటిగా ఉన్నవారు ఇప్పుడు రెండు దుకాణాలు తెరిచారు. ఎవరి కుంపటి వారిదే. పార్టీ అధికారంలో లేకపోయినా ఓ రేంజ్లో అధిపత్యపోరుకు దిగుతున్న ఆ నాయకులెవరో ఈ స్టోరీలో చూద్దాం. రెండు వర్గాలుగా చీలిన మడకశిర టీడీపీ! అనంతపురం జిల్లా టీడీపీ వర్గవిభేదాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే…
ఆయనో మంత్రి. జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో అరుదుగా కనిపిస్తారని టాక్. ఇతర జిల్లాల్లో నిర్వహించే ప్రోగ్రామ్స్‌లో తళుక్కుమన్నది తక్కువే. అలాంటిది ఆ కార్యక్రమంలో మాత్రం ఆసాంతం దగ్గరున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్. ఇంతకీ ఏంటా ప్రోగ్రామ్? ఎవరా మంత్రి? నిర్మలా సీతారామన్ టూర్‌పై ఏపీ ఆర్థికశాఖలో చర్చ! ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పీకల్లోతు ఇబ్బందుల్లో ఉంది. ఎక్కడ అప్పు దొరుకుతుందా.. అని ఆర్థికశాఖ దారులు వెతుకుతున్న పరిస్థితి. కేంద్రం వీలైనంత మేర…