అమరావతి : డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల బదిలీలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీల విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులను కూడా విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఈ నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఐదేళ్లు.. అంతకు మించి ఒకే చోట పని చేసిన వారికి తప్పని సరిగా బదిలీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. ఐటీడీఏ ప్రాంతాల్లో పని చేస్తోన్న లెక్చరర్ల కు మాత్రం అదనం గా ఐదు పాయింట్లు కేటాయిస్తామని ప్రకటించింది ఏపీ సర్కార్. ఇక మిగతా ప్రాంతాల్లో చేసే వారికీ ఎలాంటి పాయింట్లు కేటాయించ బోమని స్పష్టం చేస్తూ… ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.