టీడీపీ నేతల పై చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ నేతలకు రైతులపై ప్రేమ కాదు డ్రామా అని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఎప్పుడైనా టీడీపీ ఉద్యానవన పంటలపై దృష్టి పెట్టిందా అని అడిగారు. జీడి క్వింటాకు 9200 ఇచ్చిన ఘనత వైసీపీదే. వ్యవసాయం అంటే టీడీపీ హయాంలో దండగ, అదే వైయస్ హయాంలో వ్యవసాయం పండగ అని తెలిపారు. రైతులకు నష్టం కలిగిస్తే పుట్టగతులు ఉండవు. పంట సాగులో ఇప్పుడు హాలీడే లేదు, టీడీపీ హయాంలో ఎప్పుడూ హాలీడేనే అన్నారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా గడుపుతున్నారు. టీడీపీ డ్రామా లపై చర్చకు నేను సిద్ధం అన్నారు. కౌలు రైతుల పక్షాన నిలిచిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.
Read Also : మీ ఫోన్ పోయిందా.. అయితే ఇలా వెతకడం సులువు