ఈరోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. ప్రివిలేజ్ కమిటీ ముందు వ్యక్తిగతంగా హజరు కానున్నారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. నేడు విచారణకు హాజరు కావాలని అచ్చెన్నాయుడుకు ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది. గత సమావేశానికి విచారణ గైర్హాజరైన కూన రవికుమార్ పై చర్యలు ఖరారు చేయనున్నారు ప్రివిలేజ్ కమిటీ. కూన రవి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది ప్రివిలేజ్ కమిటీ. కూన రవిది ధిక్కారంగా భావించి కఠిన చర్యలు తీసుకునేలా అసెంబ్లీకి సిఫార్సు చేయనున్నారు ప్రివిలేజ్ కమిటీ. అయితే నేడు టీడీపీ ఎమ్మెల్యే రామనాయుడు పై వచ్చిన ఫిర్యాదు పై చర్చించనుంది కమిటీ. తన వ్యాఖ్యలు ఏ విధంగా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయోనని చెప్పాలని కోరిన మేరకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు సమాచారం పంపింది ప్రివిలేజ్ కమిటీ.