మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అక్కడి అన్ని రాజకీయ పార్టీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మూడో లిస్ట్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సీఎంవో కార్యాలయానికి నేతలు క్యూకడుతున్నారు. సీఎంవోకు వచ్చిన నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా వచ్చారు.
రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిజెక్టెడ్ పార్టీ, ఏపీకి ద్రోహం చేసిన పార్టీ అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి ఏపీలో లేదన్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్ది సేపటికే పురందేశ్వరి-నాదెండ్ల భేటీ కావడం గమనార్హం.
బీసీల్లో ఎంత మందికి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వగలమో అంతమందికి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ వర్క్ షాప్ జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగించారు.
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిట్టింగ్ స్ధానమైన అనకాపల్లి వీడి వెళ్లాల్సి వస్తుందన్నందుకు కంటతడి పెట్టుకున్నారు. రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన కార్యకర్తలు, నాయకుల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటామని ఆయన అన్నారు.
తిరువూరులో టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో జరిగిన వివాదంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కేశినేని చిన్ని ఎవరు ?.. చిన్ని ఎంపీనా, ఎమ్మెల్యేనా ? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయనే తాను సభలకు దూరంగా ఉంటున్నానని ఎంపీ తెలిపారు.
టీడీపీ, చంద్రబాబుకు వైసీపీని చూస్తే ఎందుకు అంత భయమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వైసీపీ ఇంఛార్జ్‌లను మార్చుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పురంధేశ్వరి టీడీపీ బీ టీం అన్న మంత్రి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే స్థితికి పురంధరేశ్వరి వెళ్ళిందని.. కారంచేడులో దళితులు ఎంత మంది చనిపోయారో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. త్వరలో వైఎస్.రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు అధిష్టానం నుండి సమాచారం ఉందని తెలిపారు.
చంద్రబాబు నాయుడిపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
నీతి నిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం కొంత మంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు.