కుప్పం నా సొంత ఊరు అని.. కుప్పంలో ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి గుడిపల్లి గుండెకాయ లాంటిదని, అలాంటి తనకే ఇక్కడ రక్షణ లేదన్నారు. కుప్పంలో రౌడియిజం పెరిగిపోయిందని, సామాన్యులకు ఇక్కడ రక్షణ కరువైందని వాపోయారు. ఇక రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని.. ఇక 100 రోజు సమయమే ఉందన్నారు.…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్‌పై మంత్రి జోగి రమేష్ స్పందించారు. నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 10లక్షల కోట్ల అప్పులు చేసిందని, హామీల్లో సీఎం జగ్ 85 శాతం ఫెయిల్ అయ్యారని అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగున్నర ఏళ్ళల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చామన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన పథకాలను వివరించటం చరిత్రలో జరగలేదన్నారు.…
తన అరెస్టుకు యత్నించిన ఎమ్మెల్యే, పోలీసులపై మాజీ మంత్రి అఖిల ప్రియ మండిపడ్డారు. బుధవారం భాగ్యనగరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఆమె అరెస్టుకు యత్నంచారు. ఈ సంఘటనపై అఖిల ప్రియ ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, పోలీసులు తీరుపై ధ్వజమెత్తారు. Also Read: Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి…
మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ముందస్తు అరెస్టుకు పోలీసులు యత్నించారు. బుధవారం భాగ్యనగరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అప్పటికే అదే ఊర్లో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. దీంతో అఖిల ప్రియను ఆ ఊరికి వెళ్లకుండ పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఆమె కారును అడ్డుకున్నారు. Also Read: MLA Yatnal: 40,000 కోట్ల కోవిడ్ కుంభకోణంలో యడ్యూరప్ప ప్రమేయం…
బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు పెంచేందుకు జగన్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రంలోనే పేదల విద్యార్థులు బాగుండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలో తీసుకువచ్చారని.. చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు.. వాళ్ళ బంధువులు చదవచ్చు.. కానీ బడుగు వర్గాల పిల్లలు మాత్రం చదువుకోకూడదని న్యాయస్థానాలకు వెళ్ళాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
అన్ని వర్గాల అవసరాలను తీర్చే పాలనను ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పేర్కొన్నారు. వైఎస్సార్ కంటే రెండడుగులు ముందుకు వేసి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన అన్నారు. ఎలాంటి సిఫారసు లేకుండా అర్హులందరికీ వారి ఖాతాల్లో నేరుగా లబ్ధిని అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
గతంలో వైసీపీ కోసం పనిచేసిన సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. బీహార్ వాడొచ్చాడు వాడి వల్ల ఏమవుతుందన్న చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు పీకేతో కలుస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. పది మంది ప్రశాంత్ కిషోర్‌లు వచ్చినా ప్రజలంతా సీఎం జగన్ వెంట ఉన్నారన్నారు.
టీడీపీలో వివిధ పార్టీల నుంచి చేరికలు జరుగుతున్నాయి. చంద్రబాబు సమక్షంలో పలు నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం నియోజకవర్గాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.
కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు కురబ కులస్థుల ఆరాద్య దైవం కనక దాసు విగ్రహం ఏర్పాటుకు ప్రాధాన్యత కల్పించాలని ఎందుకు ఆలోచించలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కురబ కులస్థులను గుర్తించిన పార్టీ వైసీపీ పార్టీనే అని ఆయన తెలిపారు.
ఏపీలో రాజకీయాలపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన సినీ నటుడు పృథ్వీరాజ్ ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు.